AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Khammam: చేతులు ఎలా వచ్చాయ్ స్వాతి.. భర్త మాట వినడం లేదని ఏం చేసిందో తెలుసా..?

ఖమ్మం నగరంలో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. భర్తతో జరిగిన కుటుంబ కలహాల నేపథ్యంలో ఇద్దరు చిన్నారులకు అన్నంలో ఎలుకల మందు కలిపి తినిపించిన తల్లి ఆత్మహత్యాయత్నం చేసింది. ఈ ఘటనలో వేదిక్ కుమార్ (7), తనిష్క్ (5) చికిత్స పొందుతూ మృతి చెందగా, తల్లి స్వాతి పరిస్థితి విషమంగా ఉంది. వ్యవసాయం కోసం స్వగ్రామానికి వెళ్లాలన్న భర్త సూచనపై దంపతుల మధ్య విభేదాలు నెలకొన్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. కేసు నమోదు చేసిన పోలీసులు ఘటనపై దర్యాప్తు చేపట్టారు.

Khammam: చేతులు ఎలా వచ్చాయ్ స్వాతి.. భర్త మాట వినడం లేదని ఏం చేసిందో తెలుసా..?
Crime News
N Narayana Rao
| Edited By: |

Updated on: Jun 21, 2026 | 12:28 PM

Share

ఖమ్మం జిల్లా ఖమ్మం నగరంలో విషాదం చోటుచేసుకుంది. తల్లి ఇద్దరు పిల్లలకు అన్నంలో ఎలుకల మందు కలిపి తినిపించి.. ఆత్మహత్యాయత్నం చేసుకుంది. ఈ ఘటనలో చికిత్స పొందుతూ ఇద్దరు పిల్లలు మృతి చెందారు. తల్లి పరిస్థితి విషమంగా ఉండగా.. ఆమెకు ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు.. మృతులు వేదిక్‌ కుమార్(7), తనిష్క్‌(5)గా పోలీసులు గుర్తించారు. వివరాల ప్రకారం.. లింగరాజు-స్వాతి దంపతుల స్వగ్రామం ఏదులపురం మున్సిపాలిటీ లోని గుర్రాలపాడు కాగా వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. గత రెండు సంవత్సరాలుగా ఖమ్మం నగరంలోని పంపింగ్ వెల్ రోడ్ లో నివాసం ఉంటున్నారు. గుర్రాలపాడులో ఉండి వ్యవసాయం చేసుకుందామని భర్త చెప్పడంతో.. స్వాతి వ్యతిరేకించింది. ఈ విషయంపై ఇద్దరి మధ్య కలహాలు మొదలయ్యాయి. దీంతో నిన్న భర్త బయటకు వెళ్లిన సమయంలో పిల్లలకు అన్నంలో ఎలుకల మందు కలిపి తినిపించింది. లింగరాజు వచ్చే సరికి పిల్లలు అపస్మారక స్థితిలో ఉండటంతో చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఇద్దరూ మృతి చెందడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

భర్త తన మాట వినడం లేదని కోపంతో స్వాతి నేను సాయంత్రం ఈ దారుణానికి ఒడిగట్టింది. ఇంట్లో ఉన్న ఇద్దరు చిన్నారులకు అన్నంలో ఎలుకలు ముందు కలిపి తినిపించింది. ఆ తర్వాత ఏమీ తెలియనట్టు భర్తకు ఫోన్ చేసి పిల్లలకు పుడ్ పాయిజన్ అయ్యిందని త్వరగా ఇంటికి రావాలని చెప్పింది. ఈలోపే పరిస్థితి విషమించడంతో హుటాహుటిన అర్ధరాత్రి ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ చిన్నారులు మృతి చెందారు. పిల్లలతో కలిసి భార్యాభర్తలు ఖమ్మం త్రీ టౌన్ ప్రాంతం గాంధీనగర్ లో నివాసం ఉంటున్నారు. భర్త లింగరాజు స్థానికంగా పాల వ్యాపారం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. అయితే, ఇబ్బందిగా ఉంది సొంతూరు గుర్రాలపాడు కి వెళదామని అక్కడే కాపురం చేద్దామని భర్త చెప్పడంతో.. అప్పటినుంచి ఇద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయని.. కుటుంబసభ్యులు తెలిపారు. కాగా.. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
భర్త మాట వినడం లేదని.. ఇద్దరు పిల్లలకు విషం ఇచ్చిన కన్నతల్లి
భర్త మాట వినడం లేదని.. ఇద్దరు పిల్లలకు విషం ఇచ్చిన కన్నతల్లి
ఈడొచ్చిన అమ్మాయిలు పక్కా తినాల్సిన పూర్వీకుల పొలం పచ్చి కారం..
ఈడొచ్చిన అమ్మాయిలు పక్కా తినాల్సిన పూర్వీకుల పొలం పచ్చి కారం..
అర్థరాత్రి భారీ లోడ్‌లతో రోడ్డుపైకి వచ్చిన లారీలు.. కట్‌చేస్తే..
అర్థరాత్రి భారీ లోడ్‌లతో రోడ్డుపైకి వచ్చిన లారీలు.. కట్‌చేస్తే..
మనుషులను సిలువ వేసి చంపై సైకో.. OTTలో ఈ క్రైమ్ థ్రిల్లర్ చూశారా?
మనుషులను సిలువ వేసి చంపై సైకో.. OTTలో ఈ క్రైమ్ థ్రిల్లర్ చూశారా?
ఇంట్లో నుంచి పారిపోయి పెళ్లి చేసుకుంది.. కట్ చేస్తే
ఇంట్లో నుంచి పారిపోయి పెళ్లి చేసుకుంది.. కట్ చేస్తే
డైలీ ఒక్కసారే బ్రష్ చేస్తున్నారా?.. నైట్ స్కిప్ చేయడం ఎంత డేంజరో
డైలీ ఒక్కసారే బ్రష్ చేస్తున్నారా?.. నైట్ స్కిప్ చేయడం ఎంత డేంజరో
ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఎక్కి నిద్రపోయాడు.. మెలుకువరాగానే..
ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఎక్కి నిద్రపోయాడు.. మెలుకువరాగానే..
విమానాల్లో NEET క్వశ్చన్‌ పేపర్ల తరలింపు.. ఈసారైన పదిలమేనా?
విమానాల్లో NEET క్వశ్చన్‌ పేపర్ల తరలింపు.. ఈసారైన పదిలమేనా?
ఫాథర్స్ డే స్పెషల్.. మటన్ ఆమ్లెట్‌తో మీ నాన్నకు ప్రేమగా..
ఫాథర్స్ డే స్పెషల్.. మటన్ ఆమ్లెట్‌తో మీ నాన్నకు ప్రేమగా..
లంకను తగలెట్టిన వైభవ్ సూర్యవంశీ
లంకను తగలెట్టిన వైభవ్ సూర్యవంశీ