లాక్‌డౌన్‌లోనూ బిర్యానీని తెగ తిన్నారట..!

లాక్​డౌన్​లోనూ బిర్యానీని వదల్లేదట భోజన ప్రియులు. దేశవ్యాప్తంగా ఆన్​లైన్​లో అధిక శాతం ఆర్డర్​ ఇచ్చిన వాటిలో బిర్యానీ అగ్ర స్థానంలో ఉందని స్విగ్గీ తన నివేదికలో పేర్కొంది. కరోనా విజృంభిస్తున్న వేళ భోజన..

లాక్‌డౌన్‌లోనూ బిర్యానీని తెగ తిన్నారట..!
Follow us

|

Updated on: Jul 25, 2020 | 7:32 AM

లాక్‌డౌన్ సమయంలో దేశం మొత్తం ఇంట్లోనే ఉండిపోయింది. ఉరుకుల పరుగుల జీవితానికి కొంత బ్రేక్ పడటంతో కుటుంబ సభ్యులతో సమయాన్ని వెచ్చించారు. సామాన్యుడి నుంచి సెలబ్రిటీ వరకు ఫ్యామిలీతో తెగ ఎంజాయ్ చేశారు. చాలా మంది తమ కుటుంబ సభ్యులతో కలిసి రుచికరమైన వంటింటి భోజనంను ఆస్వాధించారు. అయితే ఇక్కడే మరో రహస్యం వెలుగులోకి వచ్చింది.

లాక్​డౌన్​లోనూ బిర్యానీని వదల్లేదట భోజన ప్రియులు. దేశవ్యాప్తంగా ఆన్​లైన్​లో అధిక శాతం ఆర్డర్​ ఇచ్చిన వాటిలో బిర్యానీ అగ్ర స్థానంలో ఉందని స్విగ్గీ తన నివేదికలో పేర్కొంది. కరోనా విజృంభిస్తున్న వేళ భోజన ప్రియులు ‘బిర్యానీ’పై అమితంగా ఆసక్తి చూపారని తెలిపింది. స్విగ్గీ నివేదిక ప్రకారం బిర్యానీ కోసం దాదాపు 5.5 లక్షల ఆర్డర్లు వచ్చాయని చెప్పింది. అందులో 3.35 లక్షల ఆర్డర్లతో బటర్‌ నాన్‌ రోటీ, 3.31 లక్షలతో మసాలా దోశ.. రెండు, మూడు స్థానాల్లో నిలిచాయి. వరుసగా నాలుగో ఏడాది అత్యధికంగా ఆర్డర్‌ చేసిన వంటకాలలో బిర్యానీ మొదటి స్థానాన్ని దక్కించుకుందని స్విగ్గీ వెల్లడించింది.