ప్రధాని మోదీతో మోహన్ బాబు భేటీ..!

ప్రధాని మోదీని ఢిల్లీలో  సినీ నటుడు మోహన్ బాబు కలిశారు. అరగంటకు పైగా ప్రధానిలో విలక్షణ నటుడు చర్చలు జరిపినట్టు సమాచారం. బీజేపీకి రావాలని మోహన్‌బాబును మోదీ కోరినట్టు తెలుస్తోంది. మోహన్ బాబుతో పాటు కొడుకు విష్ణు, కోడలు వెరోనికా, కూతురు లక్ష్మీ ప్రసన్న కూడా ప్రధానిని కలిశారు. కాగా 2019 ఎన్నికలకు ముందు మోహన్‌బాబు వైసీపీలో చేరారు. ఆ పార్టీ తరుఫున విసృతంగా ప్రచార కార్యక్రమాలు నిర్వహించారు. జగన్ అధికారంలోకి వచ్చాక ఆయనకు రకరకాల పదువులు […]

  • Ram Naramaneni
  • Publish Date - 12:48 pm, Mon, 6 January 20
ప్రధాని మోదీతో మోహన్ బాబు భేటీ..!

ప్రధాని మోదీని ఢిల్లీలో  సినీ నటుడు మోహన్ బాబు కలిశారు. అరగంటకు పైగా ప్రధానిలో విలక్షణ నటుడు చర్చలు జరిపినట్టు సమాచారం. బీజేపీకి రావాలని మోహన్‌బాబును మోదీ కోరినట్టు తెలుస్తోంది. మోహన్ బాబుతో పాటు కొడుకు విష్ణు, కోడలు వెరోనికా, కూతురు లక్ష్మీ ప్రసన్న కూడా ప్రధానిని కలిశారు. కాగా 2019 ఎన్నికలకు ముందు మోహన్‌బాబు వైసీపీలో చేరారు. ఆ పార్టీ తరుఫున విసృతంగా ప్రచార కార్యక్రమాలు నిర్వహించారు. జగన్ అధికారంలోకి వచ్చాక ఆయనకు రకరకాల పదువులు ఇస్తున్నారంటూ రూమర్స్ వినిపించాయి. కానీ వాటన్నింటిని ఈ సీనియర్ నటుడు ఎప్పటికప్పుడు కొట్టిపారేశారు. తాజాగా మోహన్‌బాబు పీఎంను కలవడం చర్చనీయాంశమైంది. కాగా, మధ్యాహ్నం ఆయన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కుటుంబాన్ని కలిశారు.