దీదీ యూ టర్న్.. సారీ నేను రాలేను

ప్రధాని నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరుకాకూడదని నిర్ణయించుకున్నట్లు టీఎంసీ అధినేత, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తెలిపారు. పశ్చిమ బెంగాల్‌లో జరిగిన రాజకీయ హత్యల్లో గత పంచాయితీ ఎన్నికల నుంచి మొన్నటి సార్వత్రిక ఎన్నికల వరకు మొత్తం 54 మంది బీజేపీ కార్యకర్తలు హతమయ్యారు. అయితే మోదీ మృతిచెందిన వ్యక్తులు కుటుంబ సభ్యులను ప్రమాణస్వీకారానికి ఆహ్వానించడంతో మమతా ఈ యూటర్న్ తీసుకున్నారు. అంతేకాదు హాజరుకాకపోవడగానికి గల కారణాలను లేఖలో పేర్కొన్నారు. ”నూతన ప్రధానిగా బాధ్యతలు […]

దీదీ యూ టర్న్.. సారీ నేను రాలేను
Follow us

| Edited By:

Updated on: May 30, 2019 | 9:26 AM

ప్రధాని నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరుకాకూడదని నిర్ణయించుకున్నట్లు టీఎంసీ అధినేత, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తెలిపారు. పశ్చిమ బెంగాల్‌లో జరిగిన రాజకీయ హత్యల్లో గత పంచాయితీ ఎన్నికల నుంచి మొన్నటి సార్వత్రిక ఎన్నికల వరకు మొత్తం 54 మంది బీజేపీ కార్యకర్తలు హతమయ్యారు. అయితే మోదీ మృతిచెందిన వ్యక్తులు కుటుంబ సభ్యులను ప్రమాణస్వీకారానికి ఆహ్వానించడంతో మమతా ఈ యూటర్న్ తీసుకున్నారు. అంతేకాదు హాజరుకాకపోవడగానికి గల కారణాలను లేఖలో పేర్కొన్నారు.

”నూతన ప్రధానిగా బాధ్యతలు చేపట్టబోతున్న నరేంద్రమోదీకి శుభాకాంక్షలు. రాజ్యాంగబద్దమైన ఆహ్వానాన్ని అంగీకరించి ప్రమాణస్వీకార కార్యక్రమానికి హాజరుకావాలని నిర్ణయించుకున్నాను.  అయితే బెంగాల్‌లో జరిగిన రాజకీయ అల్లర్లలో 54 మంది హత్యకు గురయ్యారని బీజేపీ చేసిన వ్యాఖ్యలు మీడియాలో వస్తుండగా చూశానని.. ఇది పూర్తిగా అబద్ధమని మమత అన్నారు. అందుకే ప్రమాణ స్వీకారానికి రాలేకపోతున్నానని తెలిపారు.