పెనుమత్స కుమారుడికి ఎమ్మెల్సీ టికెట్..
రెండు రోజుల కిందట మరణించిన సీనియర్ నేత పెనుమత్స సాంబశివరాజు కుమారుడి సురేష్‌బాబుకి (MLC) ఎమ్మెల్సీ టికెట్ ఖరారైంది. మోపిదేవి రాజీనామా చేసిన స్థానంలో...
MLC Ticket Confirms Penumatsa Suresh Babu : రెండు రోజుల కిందట మరణించిన సీనియర్ నేత పెనుమత్స సాంబశివరాజు కుమారుడి సురేష్‌బాబుకి (MLC) ఎమ్మెల్సీ టికెట్ ఖరారైంది. మోపిదేవి రాజీనామా చేసిన స్థానంలో ఆయన పేరును ఖరారు చేసింది వైసీపీ అధిష్టానం.
ఈ నెల 13న పెనుమత్స సురేష్‌బాబు నామినేషన్ వేయనున్నారు. జగన్ పార్టీ పెట్టినప్పటి నుంచి విజయనగరం జిల్లాలో పెనుమత్స సాంబశివరాజు వైసీపీతోనే ఉన్నారు. వయసు రీత్యా కొద్దికాలంగా ఆయన చురుగ్గా వ్యవహరించలేకపోయారు. పెనుమత్స మరణంతో ఆయన కుటుంబసభ్యులను ఫోన్‌లో పరామర్శించారు ముఖ్యమంత్రి జగన్.
ఆ సందర్భంగా సురేష్ బాబును ఓదార్చారు. పార్టీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే పెనుమత్స సురేష్‌బాబు పేరును ఎమ్మెల్సీ స్థానానికి ముఖ్యమంత్రి జగన్ ఖరారు చేశారు. ఎమ్మెల్యే కోటాకు సంబంధించిన ఈ స్థానం సంఖ్యాపరంగా వైసీపీకే దక్కుతుంది.
ఆంధ్రప్రదేశ్‌లో ఖాళీగా ఉన్న ఒక ఎమ్మెల్సీ స్థానం భర్తీకి నోటిఫికేషన్ విడుదలైన విషయం తెలిసిందే. నామినేషన్ దాఖలుకు ఆగస్ట్ 13 చివరి తేదీ కాగా, 24న పోలింగ్ జరగనుంది. అదే రోజు సాయంత్రం ఓట్ల లెక్కింపు జరిపిప ఫలితాలను వెల్లడిస్తారు.