“బొండా ఉమ..బార్‌లో సేల్స్ మ్యాన్‌లా మాట్లాడారు”
టీడీపీ నాయకులపై నగరి ఎమ్మెల్యే ఏపీఐఐసి చైర్ పర్సన్ ఆర్.కె.రోజా ఫైర్ అయ్యారు. వారికి అధికారం పోయాక పిచ్చెక్కిందని ఘాటు వ్యాఖ్యలు చేశారు. బొండా ఉమ పెట్టిన ప్రెస్ మీట్‌లో..మందు బ్రాండ్స్ అన్నీ ఎదురుగా పెట్టుకుని.. బార్ సేల్స్ మ్యాన్‌లా మాట్లాడారని ఎద్దేవా చేశారు. తెలుగుదేశం పార్టీ ఆఫీసులో ఈ విధంగా బాటిల్స్ పెట్టుకోని ప్రెస్ మీట్ పెట్టడాన్ని చూస్తే..అది టీడీపి పార్టీ ఆఫీసా, చంద్రన్న బెల్ట్ షాపా అర్థం కావట్లేదన్నారు. టీడీపీ నాయకులు డీ అడిక్షన్ […]
టీడీపీ నాయకులపై నగరి ఎమ్మెల్యే ఏపీఐఐసి చైర్ పర్సన్ ఆర్.కె.రోజా ఫైర్ అయ్యారు. వారికి అధికారం పోయాక పిచ్చెక్కిందని ఘాటు వ్యాఖ్యలు చేశారు. బొండా ఉమ పెట్టిన ప్రెస్ మీట్‌లో..మందు బ్రాండ్స్ అన్నీ ఎదురుగా పెట్టుకుని.. బార్ సేల్స్ మ్యాన్‌లా మాట్లాడారని ఎద్దేవా చేశారు. తెలుగుదేశం పార్టీ ఆఫీసులో ఈ విధంగా బాటిల్స్ పెట్టుకోని ప్రెస్ మీట్ పెట్టడాన్ని చూస్తే..అది టీడీపి పార్టీ ఆఫీసా, చంద్రన్న బెల్ట్ షాపా అర్థం కావట్లేదన్నారు. టీడీపీ నాయకులు డీ అడిక్షన్ సెంటర్లకు తీసుకెళ్ళి వాళ్ళను క్యూర్ చేయాలన్న రోజా, తొమ్మిది నెలల నుంచి ప్రతిపక్ష నేత చంద్రబాబు తాగుబోతుల సంఘానికి అధ్యక్షుడిలా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.
జగన్ మఖ్యమంత్రి అయిన ఒక నెలలోనే 43వేల బెల్ట్ షాపులు తీసేసిన ఘనత సాధించారని, సీఎంకు మహిళలంతా హ్యాట్సాఫ్ చెబుతున్నారని పేర్కొన్నారు. టీడీపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఒక్కసారి కూడా బార్లు, వైన్ షాపులు తగ్గించిన దాఖలాలు లేవని..కానీ జగన్ అధికారంలోకి వచ్చాక 20% వైన్ షాపులు, 40% బార్లు తగ్గించిన ఘనత సొంతం చేసుకున్నారన్నారు. సీఎం జగన్ మహిళల మంచి కోసం ఆలోచిస్తున్నారని, అందుకు ఆయన తీసుకొస్తోన్న పథకాలే ఊదాహారణగా అభివర్ణించారు. ముఖ్యమంత్రి సంతకం అంటే ఐఎస్ఐ ముద్రలా ఉండాలన్న రోజా, కానీ బాబు సీఎంగా పెట్టిన తొలి సంతకం బెల్టు షాపులు నిర్మూలన అని..అందులో ఆయన పూర్తిగా విఫలయ్యారని ఆరోపించారు. గత ప్రభుత్వం పాలించిన ఐదు సంవత్సరాలలో నారా వారి పాలన సారా పాలనలా సాగిందని రోజా ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఆ పార్టీ మాజీ మంత్రి జవహర్ బీర్‌ను హెల్త్ డ్రింక్‌గా ప్రమోట్ చెయ్యడం సిగ్గుచేటన్నారు.