BS4 Cars: వాహనప్రియులకు గుడ్ న్యూస్.. బిఎస్4 కార్లపై భారీ డిస్కౌంట్లు..!

మార్చి 31 తరువాత బిఎస్ 4 వాహన విక్రయాలు నిలిచిపోనున్నాయి. ఈ క్రమంలో బీఎస్ 4 వాహనాలపై భారీ డిస్కౌంట్లు అందజేస్తున్నాయి కార్ల కంపెనీలు. ఏప్రిల్ 1వ తేదీ నుంచి బీఎస్4 వెహికల్స్‌ అమ్మడానికి వీల్లేదంటూ

BS4 Cars: వాహనప్రియులకు గుడ్ న్యూస్.. బిఎస్4 కార్లపై భారీ డిస్కౌంట్లు..!
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Mar 03, 2020 | 10:39 PM

BS4 Cars: మార్చి 31 తరువాత బిఎస్ 4 వాహన విక్రయాలు నిలిచిపోనున్నాయి. ఈ క్రమంలో బీఎస్ 4 వాహనాలపై భారీ డిస్కౌంట్లు అందజేస్తున్నాయి కార్ల కంపెనీలు. ఏప్రిల్ 1వ తేదీ నుంచి బీఎస్4 వెహికల్స్‌ అమ్మడానికి వీల్లేదంటూ కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో ఇప్పటికే తయారు చేసిన వాహనాలను అమ్ముకునే పనిలో పడ్డాయి. అందుకోసం భారీ డిస్కౌంట్లు ఆఫర్ చేస్తున్నాయి. ఎక్కువగా ఎస్‌యూవీలపై దాదాపు రూ.లక్ష దాకా డిస్కౌంట్ అందిస్తున్నాయి.

సుప్రీం కోర్టు ఉత్తర్వుల మేరకు ఏప్రిల్ 1 తరువాత బిఎస్ 6 వాహనాలకు మాత్రమే రిజిస్ట్రేషన్ చేయనున్నారు. ఈ నేపథ్యంలో హ్యూండయ్ వెన్యూపై గరిష్ఠంగా రూ.50 వేలు, టాటా వాహనాలపై రూ. లక్ష దాకా తగ్గింపు ప్రకటించాయి. ఇక.. జీప్ కంపాస్ మిడ్-సైజ్ ఎస్‌యూవీ కంపాస్‌లో వేరియంట్ల వారీగా లక్ష నుండి 2 లక్షల వరకూ డిస్కౌంట్లు ప్రకటించింది. బీఎస్4 రెనో డస్టర్, ఆల్-వీల్ డ్రైవ్ వేరియంట్లపై రూ.2 లక్షల భారీ డిస్కౌంట్లు ఇస్తోంది. బేసిక్, మిడ్ వేరియంట్లపై రూ.లక్షన్నర దాకా ఆఫర్ ఉంది. అటు.. నిస్సాన్ కిక్స్ బీఎస్4పై రూ.2.6 లక్షల డిస్కౌంట్ ఇస్తోంది.