బస్తీ దవాఖానను ప్రారంభించిన మంత్రి ఈటెల

బస్తీ దవాఖానను ప్రారంభించిన మంత్రి ఈటెల

బోయిగూడ నూతనంగా ఏర్పాటు చేసిన బస్తీ దవాఖాన ను మంత్రి ఈటెల రాజేందర్ ప్రారంభించారు.ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు మెరుగైన వైద్య సదుపాయాలు ఏర్పాటు చేయడానికి బస్తీ ధవాఖానాలను ఏర్పాటు చేసిందని గుర్తు చేశారు

Balaraju Goud

|

Aug 14, 2020 | 12:16 PM

బోయిగూడ నూతనంగా ఏర్పాటు చేసిన బస్తీ దవాఖాన ను మంత్రి ఈటెల రాజేందర్ ప్రారంభించారు.ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు మెరుగైన వైద్య సదుపాయాలు ఏర్పాటు చేయడానికి బస్తీ ధవాఖానాలను ఏర్పాటు చేసిందని గుర్తు చేశారు. ప్రజలకు మెరుగైన వైద్యం కోసం, పేద ప్రజలకు ఇంటి వద్దే ఉచిత వైద్యం అందించాలనే సంకల్పంతో ముఖ్యమంత్ర కెసిఆర్ బస్తీ దవాఖాన ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. బస్తీ దవాఖానల ద్వారా పేద ప్రజలకు మంచి నాణ్యమైన ఉచిత వైద్యం అందుతుందన్నారు.

హైదరాబాద్ మహానగరంలో రాష్ట్రం నలుమూల నుంచి వచ్చిన జనం రెక్కాడితే గాని డొక్కాడని వందలాది మంది బస్తీల్లోనే నివాసం ఉంటున్నారన్న మంత్రి.. వారికి ఉచితంగా వైద్య సేవలు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. బస్తీ దవఖానాల్లో డాక్టర్, నర్స్ తో పాటు సపోర్టింగ్ స్టాఫ్ అందుబాటులో ఉంటారని తెలిపారు. ఎలాంటి రోగం వచ్చినా మందులు ఇవ్వడమే కాకుండా టెస్టులు కూడా చేస్తామని వెల్లడించారు. టెస్టులు అవసరమైతే శాంపిల్స్ కలెక్ట్ చేసి తెలంగాణ డయాగ్నొస్టిక్ సెంటర్ కి అనుసంధానం చేసే ప్రయత్నం చేస్తున్నామని మంత్రి ఈటెల తెలిపారు. ఇప్పటికే హైదరాబాద్ నగరంలో 168 బస్తీ దవాఖానాలు పనిచేస్తున్నాయన్న మంత్రి.. గతంలో లాగా దగ్గు, జ్వరం, జలుబు చేస్తే ఉదాసీనంగా ఉండకూడదని వెంటనే డాక్టర్లను సంప్రదించాలన్నారు. రోగులను పరీక్షించి మెరుగైన వైద్యం కోసం పెద్దాసుపత్రులకు పంపించడం జరుగుతుందని మంత్రి ఈటెల రాజేంధర్ తెలిపారు.

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu