ప్ర‌ణ‌బ్ ముఖ‌ర్జీ ఆరోగ్యం ఇంకా అలాగే ఉందిః ఆర్మీ ఆస్ప‌త్రి వైద్యులు

భార‌త మాజీ రాష్ట్ర‌ప‌తి ఆరోగ్య ప‌రిస్థితిలో ఎలాంటి మార్పు లేద‌ని ఆర్మీ ఆస్ప‌త్రి వ‌ర్గాలు పేర్కొన్నాయి. తాజాగా హెల్త్ బులిటెన్ విడుద‌ల చేసిన ఆర్మీ ఆస్ప‌త్రి వైద్యులు ప్ర‌ణ‌బ్ ఆరోగ్యంపై క్లారిటీ ఇచ్చారు. ప్ర‌ణ‌బ్ ముఖ‌ర్జీ ఆరోగ్యం ఇంకా విష‌మంగానే ఉంద‌ని, ప్ర‌స్తుతం ఎలాంటి మార్పు..

ప్ర‌ణ‌బ్ ముఖ‌ర్జీ ఆరోగ్యం ఇంకా అలాగే ఉందిః ఆర్మీ ఆస్ప‌త్రి వైద్యులు
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Aug 14, 2020 | 12:13 PM

భార‌త మాజీ రాష్ట్ర‌ప‌తి ఆరోగ్య ప‌రిస్థితిలో ఎలాంటి మార్పు లేద‌ని ఆర్మీ ఆస్ప‌త్రి వ‌ర్గాలు పేర్కొన్నాయి. తాజాగా హెల్త్ బులిటెన్ విడుద‌ల చేసిన ఆర్మీ ఆస్ప‌త్రి వైద్యులు ప్ర‌ణ‌బ్ ఆరోగ్యంపై క్లారిటీ ఇచ్చారు. ప్ర‌ణ‌బ్ ముఖ‌ర్జీ ఆరోగ్యం ఇంకా విష‌మంగానే ఉంద‌ని, ప్ర‌స్తుతం ఎలాంటి మార్పు లేద‌ని ప్ర‌క‌టించారు వైద్యులు. ప్ర‌స్తుతం ఆయ‌న ఐసీయూలోనే ఉన్నార‌ని, ఇంకా వెంటిలేట‌ర్ మీద‌నే చికిత్స తీసుకున్న‌ట్లు ఆస్ప‌త్రి వైద్యులు వెల్ల‌డించారు.

కాగా నిన్న ప్ర‌ణ‌బ్ ముఖ‌ర్జీ కోమాలో ఉన్నార‌ని, అయితే ఆయ‌న శ‌రీరంలోని ముఖ్య అవ‌య‌వాలు మాత్రం ప‌ని చేస్తున్నాయ‌ని గురువారం ఆయ‌న‌కు చికిత్స అందిస్తున్న ఆర్మీ రీసెర్చ్ అండ్ రిఫ‌ర‌ల్ ఆస్ప‌త్రి వ‌ర్గాలు పేర్కొన్న విష‌యం తెలిసిందే.

ఇక త‌మ‌ తండ్రి హెల్త్ కండీష‌న్‌పై సోష‌ల్ మీడియాలో వ‌స్తోన్న వార్త‌ల‌ను ప్ర‌ణ‌బ్ కుమారుడు, కుమార్తెలు ఖండించారు. సోష‌ల్ మీడియాలో వ‌చ్చే త‌ప్పుడు వార్త‌ల‌ను న‌మ్మ‌వ‌ద్ద‌ని తెలిపారు. ఆ వార్త‌లు కేవ‌లం ఊహాగానాలు మాత్ర‌మేన‌ని ట్విట్ట‌ర్‌లో ట్వీట్లు చేశారు. ప్ర‌స్తుతం త‌న తండ్రి ఆరోగ్యం స్థిరంగా ఉంద‌ని, ఆయ‌న కోసం మీ ప్రార్థ‌న‌ల‌ను కొన‌సాగించండి అంటూ ప్ర‌ణ‌బ్ కుమారుడు, కుమార్తె పేర్కొన్న విష‌యం తెలిసిందే.

Also Read: ప్ర‌పంచంలో ఉన్న‌ ప్రేమ‌నంతా త‌న‌పై కురిపించుః నాగ‌బాబు