AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ముఖ్యమంత్రి కొడ‌కండ్ల ప‌ర్య‌ట‌న‌కు భారీ ఏర్పాట్లు

ముఖ్యమంత్రి కేసీఆర్ జనగామ జిల్లా కొడ‌కండ్ల ప‌ర్య‌ట‌న‌కు భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ నెల 31న సీఎం కేసీఆర్  ప‌ర్య‌ట‌న‌కు వెళ్ల‌నున్న విషయం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు జరుగుతున్న ఏర్పాట్లను ప‌రిశీలించారు.

ముఖ్యమంత్రి కొడ‌కండ్ల ప‌ర్య‌ట‌న‌కు భారీ ఏర్పాట్లు
Sanjay Kasula
|

Updated on: Oct 29, 2020 | 9:24 PM

Share

CM KCR Kodaikanal Tour : ముఖ్యమంత్రి కేసీఆర్ జనగామ జిల్లా కొడ‌కండ్ల ప‌ర్య‌ట‌న‌కు భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ నెల 31న సీఎం కేసీఆర్  ప‌ర్య‌ట‌న‌కు వెళ్ల‌నున్న విషయం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు జరుగుతున్న ఏర్పాట్లను ప‌రిశీలించారు. రైతు వేదిక, పల్లె ప్రకృతి వనం, సభా స్థలం, డబుల్ బెడ్ రూం ఇండ్లు, హెలిప్యాడ్ నిర్మాణ పనులను మంత్రి ప‌రిశీలించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ… కొడకండ్ల మండల కేంద్రంలోని రైతు వేదికను సీఎం ఈ నెల 31న ప్రారంభించనున్న‌ట్లు తెలిపారు. అనంతరం పల్లె ప్రకృతి వనాన్ని సందర్శిస్తార‌న్నారు. స్థానిక మార్కెట్ ఆవరణలో ఏర్పాటు చేసే సభలో 5 వేల మంది రైతులతో సీఎం కేసీఆర్ ముఖాముఖి మాట్లాడనున్న‌ట్లు తెలిపారు.

రూ. 573 కోట్లతో రాష్ట్రంలో 2604 రైతు వేదికలను నిర్మిస్తున్న‌ట్లు వెల్ల‌డించారు. ప్రతి 5 వేల మంది రైతులకు ఒక రైతు వేదికను ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంద‌న్నారు. రైతు వేదికల ద్వారా రైతు లను సంఘటితం చేయడం, సమావేశాల ద్వారా గిట్టుబాటు ధరలు తెలుసుకోవడం, వ్యవసాయ మెలకువలు నేర్చుకుని, మంచి దిగుబడులు సాధించే అవకాశం ఉంటుందన్నారు. వ్యవసాయరంగ అభివృద్ధికి మన రాష్ట్రంలో సీఎం కేసీఆర్ తీసుకున్నన్ని చర్యలు దేశంలో మరెవరూ తీసుకోలేద‌న్నారు.

Follow Us
క్యాన్సర్‌కు చెక్ పెట్టే శక్తి ఈ మూలికల్లో ఉందా? శాస్త్రవేత్తల..
క్యాన్సర్‌కు చెక్ పెట్టే శక్తి ఈ మూలికల్లో ఉందా? శాస్త్రవేత్తల..
మొదటిసారి హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటున్నారా? ఈ తప్పులు చేయకండి
మొదటిసారి హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటున్నారా? ఈ తప్పులు చేయకండి
365 రోజులు నిల్వ ఉండే ఏకైక పచ్చడి (పక్కా కొలతలతో)
365 రోజులు నిల్వ ఉండే ఏకైక పచ్చడి (పక్కా కొలతలతో)
నెల్లూరు పులిబొంగరాలు ఎర్రకారం.. సూపర్ కాంబినేషన్..
నెల్లూరు పులిబొంగరాలు ఎర్రకారం.. సూపర్ కాంబినేషన్..
రాత్రికి రాత్రే ఐసీసీని షేక్ చేసిన వైభవ్ సూర్యవంశీ..!
రాత్రికి రాత్రే ఐసీసీని షేక్ చేసిన వైభవ్ సూర్యవంశీ..!
శృంగార సమస్యల సంజీవని ఈ ఆయుర్వేదం హల్వా.. 
శృంగార సమస్యల సంజీవని ఈ ఆయుర్వేదం హల్వా.. 
ఈ 5 మొక్కలు నాటితే శుభం.. వాస్తు ప్రకారం ఇంటికి సానుకూల శక్తి,..
ఈ 5 మొక్కలు నాటితే శుభం.. వాస్తు ప్రకారం ఇంటికి సానుకూల శక్తి,..
HIV బాధితులు ఎక్కువగా ఉన్న రాష్ట్రాల్లో 3వ స్థానానికి కర్నాటక
HIV బాధితులు ఎక్కువగా ఉన్న రాష్ట్రాల్లో 3వ స్థానానికి కర్నాటక
సొరకాయతో అదిరిపోయే హల్వా.. చల్లటి వెదర్లో క్రీమీ డెజర్ట్..
సొరకాయతో అదిరిపోయే హల్వా.. చల్లటి వెదర్లో క్రీమీ డెజర్ట్..
నెల రోజుల పాటు టీ తాగడం మానేస్తే శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా?.
నెల రోజుల పాటు టీ తాగడం మానేస్తే శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా?.