ఏపీలో గ్రూప్-1 మెయిన్స్ కొత్త షెడ్యూల్…

ఏపీలో నవంబర్ 2వ తేదీ నుంచి 13 వరకు జరగాల్సిన మెయిన్స్ పరీక్షలను హైకోర్టు ఆదేశాల మేరకు ఏపీపీఎస్సీ వాయిదా వేసిన సంగతి తెలిసిందే.

ఏపీలో గ్రూప్-1 మెయిన్స్ కొత్త షెడ్యూల్...
Follow us
Ravi Kiran

|

Updated on: Oct 29, 2020 | 9:22 PM

Group 1 Mains New Exam Dates: ఏపీలో నవంబర్ 2వ తేదీ నుంచి 13 వరకు జరగాల్సిన మెయిన్స్ పరీక్షలను హైకోర్టు ఆదేశాల మేరకు ఏపీపీఎస్సీ వాయిదా వేసిన సంగతి తెలిసిందే. ఇక తాజాగా ఆ వాయిదా పడిన గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలకు సంబంధించి కొత్త షెడ్యూల్‌ను ప్రకటించింది. డిసెంబర్ 14 నుంచి 20 వరకు గ్రూప్-1 మెయిన్స్ నిర్వహించనున్నట్లు పేర్కొంది.

అలాగే నవంబర్ 21 నుంచి 29 వరకు ప్రభుత్వ ఉద్యోగులకు డిపార్ట్‌మెంటల్ పరీక్షలు జరగుతాయని తెలిపింది. కాగా, ఏపీపీఎస్సీ గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్షా ఫలితాలను రిలీజ్ చేసింది. దీనితో మెయిన్స్‌కు అర్హత సాధించిన అభ్యర్ధుల లిస్టును, కొత్త షెడ్యూల్ పరీక్షల తేదీలను అఫీషియల్ వెబ్‌సైట్ psc.ap.gov.inలో అందుబాటులో ఉంచినట్లు స్పష్టం చేసింది.

Also Read:

Bigg Boss 4: ఈ సీజన్‌ టాప్ 5‌లో నిలిచేది వీళ్లే..

శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్.. రీఫండ్ సమయం పెంపు.!