AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వారికి ఓపిక లేకనే కాలి నడకన ఇళ్లకు బయల్దేరారు..

లాక్‌డౌన్‌ సమయంలో వలస కార్మికులను వారి స్వస్థలాలకు చేర్చేందుకు కేంద్రం తగినన్ని సదుపాయాలు కల్పించినప్పటికీ.. కొంతమంది సహనం కోల్పోవడమే కాకుండా వేచి ఉండలేక కాలి నడకను సొంత ఊళ్లకు..

వారికి ఓపిక లేకనే కాలి నడకన ఇళ్లకు బయల్దేరారు..
Ravi Kiran
|

Updated on: Jun 03, 2020 | 3:15 PM

Share

లాక్‌డౌన్‌ సమయంలో వలస కార్మికులను వారి స్వస్థలాలకు చేర్చేందుకు కేంద్రం తగినన్ని సదుపాయాలు కల్పించినప్పటికీ.. కొంతమంది సహనం కోల్పోవడమే కాకుండా వేచి ఉండలేక కాలి నడకను సొంత ఊళ్లకు చేరుకునే ప్రయత్నం చేశారని కేంద్ర హోంమంత్రి అమిత్ షా సోమవారం నాడు ‘సీఎన్‌ఎన్‌–న్యూస్‌ 18’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించారు.

దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా కేంద్ర ప్రభుత్వం మార్చి 25న దేశవ్యాప్తంగా లాక్ డౌన్ విధించిన సంగతి తెలిసిందే. ఇక వలస కార్మికులను వారి స్వస్థలాలకు తరలించేందుకు ఏప్రిల్ 20 నుండి బస్సు సర్వీసులను, మే 1 నుంచి శ్రామిక్ రైళ్లను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అయితే ప్రజారవాణా నిషేధం ఉన్న సమయంలో చాలామంది వలస కూలీలు కాలి నడకన వారి స్వగ్రామాలకు చేరుకునే ప్రయత్నంలో సుమారు 170 మంది కార్మికులు వివిధ ప్రమాదాల్లో మరణించారు. అటు వడగాలులకు తాళలేక మరికొందరు మృత్యువాతపడ్డారు. ఇక మే 9 నుంచి మే 27 మధ్య శ్రామిక్ రైళ్లలో ఆకలి, సూర్యుడి భగభగల వల్ల చనిపోయారని రైల్వే ప్రొటెక్షన్ ఫోర్సు గణాంకాలు చెబుతున్నాయి.

“లాక్ డౌన్ వేళ చాలా మంది ప్రజలు ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వచ్చింది” అని ఒప్పుకున్న అమిత్ షా, 5-6 రోజులు వరకు కొన్ని అవాంఛిత సంఘటనలు జరిగాయని పేర్కొన్నారు. వలస కార్మికులకు కేంద్ర ప్రభుత్వం అన్ని సౌకర్యాలు కల్పించిందన్నారు. “అందువల్లే కోటి కంటే ఎక్కువ మంది వలస కార్మికులు తమ స్వస్థలాలకు చేరుకున్నారని అమిత్ షా తెలిపారు. వలస కార్మికులను తమ సొంతూళ్ళకు పంపించేందుకు సుమారు రూ .11 వేల కోట్లు ఖర్చు చేసినట్లు చెప్పిన షా.. బస్సు సర్వీసుల ద్వారా 41 లక్షల మందిని.. అలాగే శ్రామిక్ రైళ్ల ద్వారా 55 లక్షల మంది వలస కార్మికులను సొంతూళ్లకు చేర్చామని” ఆయన చెప్పారు.

రాష్ట్రాలలోని ఆరోగ్య సంరక్షణ సౌకర్యాలను బలోపేతం చేయడానికి కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ వ్యవధిని ఉపయోగించినట్లు హోంమంత్రి అమిత్ షా వెల్లడించారు. “అప్పటికి ఆరోగ్య సౌకర్యాలు సిద్ధంగా లేవు, రాష్ట్రాలు కూడా సిద్ధంగా లేవు, క్వారంటైన్ సౌకర్యాలు లేవు” అని షా అన్నారు. “రెండు నెలల్లో వీటన్నింటిని సిద్దం చేశామని వెల్లడించారు.

Also Read:

ఏపీలో కొన్ని స్టేషన్లలోనే ఆగనున్న రైళ్లు.. వారికి డబ్బులు రీఫండ్..

కరోనా పరీక్షల్లో ఏపీ మరో రికార్డు… రికవరీ రేటు కూడా సూపర్!

కరోనా లక్షణాలు పద్నాలుగు.. తేల్చి చెప్పిన ఐసీఎంఆర్..!

ఏపీలో జూలై 10 నుంచి టెన్త్ పరీక్షలు.. విద్యార్ధుల కోసం 8 లక్షల మాస్కులు..