త‌న కోవిడ్-19 టెస్ట్ రిపోర్ట్ షేర్ చేసిన స్టార్ హీరో…

మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ ఇటీవ‌లే ఇండియా చేరుకున్న విష‌యం తెలిసిందే. అత‌డు చేస్తున్న తాజా సినిమా ‘ఆదుజీవితం’ షూటింగ్ కోసం..మొత్తం 58 మంది మూవీ యూనిట్ జోర్డాన్ వెళ్లారు. అయితే అనుకోకుండా ప్ర‌భుత్వం క‌రోనా క‌ట్టడి చ‌ర్య‌ల్లో భాగంగా లాక్‌డౌన్ ప్ర‌క‌టించ‌డంతో వారంతా అక్క‌డే ఉండిపోవాల్సిన ప‌రిస్థితి ఏర్పడింది. అయితే ఇటీవ‌ల ప్ర‌భుత్వం కొన్ని స‌డ‌లింపులు ఇవ్వ‌డంతో.. ప్ర‌త్యేక విమానంలో వారంతా ఇండియాకు తిరిగొచ్చారు. జోర్డాన్‌లో క‌రోనా కేసులు అధికంగా ఉండ‌టంతో వీరంద‌రిని క్వారంటైన్‌లో […]

  • Ram Naramaneni
  • Publish Date - 3:08 pm, Wed, 3 June 20
త‌న కోవిడ్-19 టెస్ట్ రిపోర్ట్ షేర్ చేసిన స్టార్ హీరో...

మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ ఇటీవ‌లే ఇండియా చేరుకున్న విష‌యం తెలిసిందే. అత‌డు చేస్తున్న తాజా సినిమా ‘ఆదుజీవితం’ షూటింగ్ కోసం..మొత్తం 58 మంది మూవీ యూనిట్ జోర్డాన్ వెళ్లారు. అయితే అనుకోకుండా ప్ర‌భుత్వం క‌రోనా క‌ట్టడి చ‌ర్య‌ల్లో భాగంగా లాక్‌డౌన్ ప్ర‌క‌టించ‌డంతో వారంతా అక్క‌డే ఉండిపోవాల్సిన ప‌రిస్థితి ఏర్పడింది. అయితే ఇటీవ‌ల ప్ర‌భుత్వం కొన్ని స‌డ‌లింపులు ఇవ్వ‌డంతో.. ప్ర‌త్యేక విమానంలో వారంతా ఇండియాకు తిరిగొచ్చారు. జోర్డాన్‌లో క‌రోనా కేసులు అధికంగా ఉండ‌టంతో వీరంద‌రిని క్వారంటైన్‌లో ఉంచారు. ఈ క్ర‌మంలో పృథ్వీరాజ్ కోవిడ్-19 టెస్ట్ చేయించుకోగా నెగెటివ్ అని తేలింది.

కాగా త‌న టెస్ట్ రిపోర్టును పృథ్వీరాజ్ త‌న ట్విట్ట‌ర్ ద్వారా షేర్ చేస్తూ..“కోవిడ్-19 టెస్ట్ చేయించుకోగా నెగెటివ్ వ‌చ్చింది. అయినా స‌రే క్వారంటైన్ పూర్త‌యిన త‌ర్వాతే ఇంటికి వెళ్తా. మీరు ఇంటి వ‌ద్దే ఉండండి. జాగ్ర‌త్త‌లు తీసుకోండి” అని పేర్కొన్నాడు. త‌న అభిమాన హీరో ఇత‌ర దేశంలో చిక్కుకుపోవ‌డంతో కంగారు ప‌డ్డ ఫ్యాన్స్…అత‌డి కోవిడ్ 19 రిపోర్ట్స్ నెగెటివ్ రావ‌డంతో ఇప్పుడు ఊరటగా ఫీల్ అవుతున్నారు.