AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ వర్సెస్ మీరా చోప్రా.. ఇదే జరిగింది !

హీరోయిన్‌ మీరాచోప్రా వ్యవహారం టాలీవుడ్‌లో పెద్ద చర్చకు దారితీసింది. ఫ్యాన్స్‌ను హీరోలు అదుపులో పెట్టలేరా అనే ప్రశ్నలు మొదలయ్యాయి.....

జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ వర్సెస్ మీరా చోప్రా.. ఇదే జరిగింది !
Sanjay Kasula
|

Updated on: Jun 03, 2020 | 3:14 PM

Share

Meera Chopra abused by Jr. NTR fans : హీరోయిన్‌ మీరాచోప్రా వ్యవహారం టాలీవుడ్‌లో పెద్ద చర్చకు దారితీసింది. ఫ్యాన్స్‌ను హీరోలు అదుపులో పెట్టలేరా అనే ప్రశ్నలు మొదలయ్యాయి. ట్విట్టర్‌లో ఆస్క్‌ మీరా అంటూ తాజాగా మీరాచోప్రా ముచ్చటించారు. ఈ సందర్భంగా ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు మహేష్‌బాబు అంటే ఇష్టం అని చెప్పుకొచ్చారు మీరా. అయితే ఎన్టీఆర్ గురించి ఏమైనా చెప్పండి అంటూ మరో ఫ్యాన్ అడిగాడు. దీనికి సమాధానంగా ఆయన గురించి తెలియదు… నేను ఆయన ఫ్యాన్‌ని కాదు అంటూ మీరా చెప్పుకొచ్చారు. అంతే ఆ ఒక్క ట్వీట్‌తో ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు బద్ధ శత్రువు అయిపోయారు మీరాచోప్రా.

మీరాచోప్రా ఇచ్చిన సమాధానంతో అసహనానికి గురైన కొందరు నెటిజన్లు.. ఆమెను అసభ్య పదజాలంతో దూషిస్తూ ట్వీట్లు పెట్టారు. అంతేకాదు ఆన్‌లైన్‌ వేదికగా బెదిరింపులకు పాల్పడ్డారు. నీ తల్లిదండ్రులకు కరోనా వస్తుంది పో.. అంటూ శాపనార్థాలు కూడా పెట్టారు.

నెటిజన్ల ట్వీట్లతో ఆవేదనకు గురైన మీరాచోప్రా ట్విటర్‌ వేదికగా సైబర్‌ క్రైమ్‌ పోలీసులను ఆశ్రయించారు. కొందరు నెటిజన్లు తనని వేధిస్తున్నారని, వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. బూతులు తిడుతూ వస్తున్న ట్వీట్లను స్క్రీన్‌ షాట్స్‌ తీసి పోలీసులకు షేర్‌ చేశారు. పోలీసులతోపాటు ఎన్టీఆర్‌కి కూడా ట్వీట్‌ చేశారు మీరాచోప్రా. మీకంటే ఎక్కువగా మహేశ్‌ బాబుని అభిమానిస్తున్నానని చెప్పినందుకు మీ అభిమానులు నన్ను వేధిస్తున్నారు. ఇలాంటి ఫ్యాన్స్‌ ఉంటే విజయం వరిస్తుందని మీరు భావిస్తున్నారా?’ అంటూ ఎన్టీఆర్‌ను ప్రశ్నించారు. అంతేకాదు ఫ్యాన్స్‌ బిహేవియర్‌పై హీరోలే బాధ్యత తీసుకోవాలని మీరాచోప్రా కోరారు.

 పోలీసుల ఎంట్రీ…

files police complaint : దీంతో రంగంలోకి దిగిన పోలీసులు.. మీరాచోప్రా ఫిర్యాదుపై స్పందించారు. ఆమెపై అసభ్య పదజాలంతో పెట్టిన పోస్టులను తొలగించారు.