ఢిల్లీ సర్కారీ బడుల్లో మెలానియా సందడి.. విద్యార్థులతో ముచ్చట్లు..!

యుఎస్ ప్రెసిడెంట్ భారత పర్యటన గడువు సమీపిస్తున్న కొద్దీ కేంద్రం, గుజరాత్ ప్రభుత్వ పెద్దలు, అధికార యంత్రాంగంలో హడావుడీ కనిపిస్తోంది. డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలను స్వీకరించిన తరువాత తొలిసారిగా భారత్‌కు రానున్నారు. దీనితో అద్దిరిపోయేలా స్వాగత సత్కార కార్యక్రమాలను చేపట్టింది కేంద్ర ప్రభుత్వం. ఈ పర్యటన సందర్భంగా ట్రంప్.. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రుపాణి, ఇతర పారిశ్రామిక దిగ్గజాలతో భేటీ కానుండగా.. దీనికి భిన్నంగా ఆయన భార్య మెలానియా షెడ్యూల్‌ను […]

ఢిల్లీ సర్కారీ బడుల్లో మెలానియా సందడి..  విద్యార్థులతో ముచ్చట్లు..!
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Feb 20, 2020 | 7:53 PM

యుఎస్ ప్రెసిడెంట్ భారత పర్యటన గడువు సమీపిస్తున్న కొద్దీ కేంద్రం, గుజరాత్ ప్రభుత్వ పెద్దలు, అధికార యంత్రాంగంలో హడావుడీ కనిపిస్తోంది. డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలను స్వీకరించిన తరువాత తొలిసారిగా భారత్‌కు రానున్నారు. దీనితో అద్దిరిపోయేలా స్వాగత సత్కార కార్యక్రమాలను చేపట్టింది కేంద్ర ప్రభుత్వం. ఈ పర్యటన సందర్భంగా ట్రంప్.. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రుపాణి, ఇతర పారిశ్రామిక దిగ్గజాలతో భేటీ కానుండగా.. దీనికి భిన్నంగా ఆయన భార్య మెలానియా షెడ్యూల్‌ను రూపొందించారు.

ప్రథమ మహిళ మెలానియా ట్రంప్.. ఢిల్లీ నగర వీధుల్లో సందడి చేయనున్నారు. ప్రభుత్వ పాఠశాలలను సందర్శించనున్నారు. విద్యార్థులతో ముఖాముఖీ భేటీ నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ఆమె ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, మంత్రి మనీష్ సిసోడియాలను కలుస్తారు. వారితో కలిసి ప్రభుత్వ పాఠశాలలను సందర్శిస్తారు. ఢిల్లీ ప్రభుత్వం పాఠశాలల్లో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన హ్యాపీనెస్ క్లాసుల్లో పాల్గొంటారు మెలానియా. సుమారు గంట పాటు విద్యార్థులతో భేటీ అవుతారు.

మరోవైపు మెలానియాను ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా స్వాగతించే అవకాశం ఉందని ఆప్ వర్గాలు తెలిపాయి. దీంతో ఢిల్లీలో కట్టుదిట్టమైన బందోబస్తును ఏర్పాటు చేయబోతున్నామని ఢిల్లీ పోలీస్ కమిషనర్ అమూల్య పట్నాయక్ తెలిపారు. మూడంచెల భద్రతా వ్యవస్థను కల్పిస్తామని అన్నారు. మెలానియా పర్యటించే ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలను విధిస్తామని, డ్రోన్లతో నిఘా వ్యవస్థను బలోపేతం చేస్తామని అన్నారు.

[svt-event date=”20/02/2020,7:31PM” class=”svt-cd-green” ]

[/svt-event]