అక్కడ ఇంటికే మద్యం సరఫరా!
దేశంలో కోవిద్-19 విలయతాండవం చేస్తోంది. ఈ మహమ్మారి కట్టడికోసం ప్రభుత్వాలు పలు చర్యలు చేపడుతున్నాయి. ఈ క్రమంలో ఇంటికే మద్యం సరఫరా చేసేందుకు మేఘాలయ ప్రభుత్వం నిర్ణయించింది.
Home delivery of liquor: దేశంలో కోవిద్-19 విలయతాండవం చేస్తోంది. ఈ మహమ్మారి కట్టడికోసం ప్రభుత్వాలు పలు చర్యలు చేపడుతున్నాయి. ఈ క్రమంలో ఇంటికే మద్యం సరఫరా చేసేందుకు మేఘాలయ ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా మద్యం దుకాణాలకు లైసెన్సులు జారీ చేయనుంది. ఈ మేరకు ఆ రాష్ట్రమంత్రి జేమ్స్ కే సంగ్మా తెలిపారు. ఇంటికే మద్యం సరఫరా చేయాలన్న ప్రతిపాదనను క్యాబినెట్ ఆమోదించిందని పేర్కొన్నారు.
కాగా.. ఒక ఆర్డర్‌పై మూడు లీటర్ల మద్యం, నాలుగు లీటర్ల బీర్ కన్నా ఎక్కువ సరఫరా చేయడానికి వీలు లేదని తెలిపింది. కొనుగోలుదారులు తమ వయసు 20 ఏండ్లకుపైగానే ఉందని తెలిపే పత్రాన్ని తప్పకుండా సమర్పించాలని, తప్పుడు పత్రాలు సమర్పిస్తే కఠిన చర్యలుంటాయని హెచ్చరించింది.
Read More:
ఏపీలోని ఆ జిల్లాల్లో.. మరోసారి కఠిన లాక్‌డౌన్..?
జగన్ కీలక నిర్ణయం.. సామాజిక ఆసుపత్రుల్లోనూ ఆక్సిజన్ బెడ్స్..!