AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇద్దరు ముఖ్యమంత్రులకు కరోనా నెగెటివ్ రిపోర్ట్

కరోనా వైరస్ దేశ వ్యాప్తంగా కలవరాన్ని సృష్టిస్తోంది. మంత్రులు, రాజకీయ నేతలు సైతం కరోనా బారినపడుతున్నారు. తాజాగా పుదుచ్చేరి, మేఘాలయ ముఖ్యమంత్రులు ముందు జాగ్రత్తగా కరోనా పరీక్షలు చేయించుకున్నారు. అయితే ఇద్దరికి నెగిటివ్ రావడంతో అంతా ఉపిరి పీల్చుకున్నారు.

ఇద్దరు ముఖ్యమంత్రులకు కరోనా నెగెటివ్ రిపోర్ట్
Balaraju Goud
|

Updated on: Jun 29, 2020 | 6:36 PM

Share

కరోనా వైరస్ దేశ వ్యాప్తంగా కలవరాన్ని సృష్టిస్తోంది. ఏ కొద్దిపాటి లక్షణాలు ఉన్నా కరోనా టెస్టులు చేయించుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. మంత్రులు, రాజకీయ నేతలు సైతం కరోనా బారినపడుతున్నారు. తాజాగా పుదుచ్చేరి, మేఘాలయ ముఖ్యమంత్రులు ముందు జాగ్రత్తగా కరోనా పరీక్షలు చేయించుకున్నారు. అయితే ఇద్దరికి నెగెటివ్ రావడంతో అంతా ఉపిరి పీల్చుకున్నారు. మేఘాల‌య ముఖ్య‌మంత్రి కే సంగ్మా కొవిడ్ పరీక్షలు చేయించుకున్నారు. దీంతో అతనికి రెండోసారి కూడా క‌రోనా నెగెటివ్ నిర్ధార‌ణ అయిన‌ట్లు ఆ రాష్ర్ట వైద్యాధికారులు వెల్ల‌డించారు. సీఎం సంగ్మా ర‌క్త న‌మూనాల‌ను జూన్ 22న సేక‌రించి ప‌రీక్ష‌లు నిర్వ‌హించగా, నెగెటివ్ వచ్చినట్లు అధికారులు తెలిపారు. అయితే మరోసారి ఆదివారం కూడా సంగ్మాకు క‌రోనా ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌గా రెండోసారి నెగెటివే వ‌చ్చిన‌ట్లు అధికారులు స్ప‌ష్టం చేశారు. ముఖ్యమంత్రికి నెగిటివ్ రావ‌డంతో అధికారులు, అభిమానులు ఉపిరిపీల్చుకున్నారు. ఇక ఇప్పటి వరకు మేఘాల‌య‌లో 50 మంది కరోనా బారినపడ్డాయి. అయితే, ఒకరు మాత్రమే కరోనాతో మృతి చెందినట్లు అధికారులు వెల్లడించారు.

అటు, పుదుచ్చేరి ముఖ్య‌మంత్రి నారాయ‌ణ‌స్వామి కూడా ఇప్పటికే కరోనా పరీక్షలు చేయించుకున్నారు. ఆయనతో పాటు సిబ్బందికి కూడా పరీక్షలు నిర్వహించారు అధికారులు. సీఎంతో సహా సిబ్బంది అందరికీ కూడా క‌రోనా నెగెటివ్ వ‌చ్చిన‌ట్లు అక్క‌డి వైద్యాధికారులు వెల్ల‌డించారు. అయితే సీఎం కార్యాల‌యం వ‌ద్ద ఉండే ఓ గ‌న్ మెన్ తండ్రికి క‌రోనా పాజిటివ్ వ‌చ్చింది. దీంతో 32 మంది భ‌ద్ర‌తా సిబ్బందికి క‌రోనా ప‌రీక్ష‌లు నిర్వ‌హించారు. వారి టెస్ట్ ఫలితాలు వెల్లడి కావల్సి ఉంది.

Follow Us
ఆ ఒక్క హీరోతో వరుసగా మూడు సినిమాలు.. అది అంత మంచిది కాదు..
ఆ ఒక్క హీరోతో వరుసగా మూడు సినిమాలు.. అది అంత మంచిది కాదు..
గాల్లో ఉండగా బ్రిటిష్ ఎయిర్‌వేస్ విమానంలో హైఅలర్ట్.. ఏంజరిగిందంటే
గాల్లో ఉండగా బ్రిటిష్ ఎయిర్‌వేస్ విమానంలో హైఅలర్ట్.. ఏంజరిగిందంటే
ఫాస్టెస్ట్ సెంచరీ చేస్తా.. వైభవ్ టార్గెట్లు మామూలుగా లేవు
ఫాస్టెస్ట్ సెంచరీ చేస్తా.. వైభవ్ టార్గెట్లు మామూలుగా లేవు
శంషాబాద్ ఎయిర్‌పోర్టులో బుల్లెట్ కలకలం.. ప్రయాణికుడు అదుపులోకి..
శంషాబాద్ ఎయిర్‌పోర్టులో బుల్లెట్ కలకలం.. ప్రయాణికుడు అదుపులోకి..
నాన్నమ్మ కమ్మలపై కన్నేసిన మనవడు.. వాటి కోసం ఏం చేశాడో తెలిస్తే..
నాన్నమ్మ కమ్మలపై కన్నేసిన మనవడు.. వాటి కోసం ఏం చేశాడో తెలిస్తే..
భారత్, విండీస్ తొలి టీ20.. ప్లేయింగ్ ఎలెవన్‌లో 4 భారీ మార్పులు
భారత్, విండీస్ తొలి టీ20.. ప్లేయింగ్ ఎలెవన్‌లో 4 భారీ మార్పులు
గోల్డెన్ ఛాన్స్ మిస్సైన రుక్మిణి వసంత్..
గోల్డెన్ ఛాన్స్ మిస్సైన రుక్మిణి వసంత్..
ChatGPT Plus అదిరిపోయే ఆఫర్.. నెల రోజుల పాటు ఫ్రీ ట్రయల్!
ChatGPT Plus అదిరిపోయే ఆఫర్.. నెల రోజుల పాటు ఫ్రీ ట్రయల్!
మధుమిత ఎంతకు తెగించింది భయ్యా.. కారెక్కి ఏం చేసిందో తెలుసా..?
మధుమిత ఎంతకు తెగించింది భయ్యా.. కారెక్కి ఏం చేసిందో తెలుసా..?
ATM ధ్వంసం చేసి రూ.30లక్షలు కాజేసిన కేటుగాళ్లు
ATM ధ్వంసం చేసి రూ.30లక్షలు కాజేసిన కేటుగాళ్లు