AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pandu Master: పండు మాస్టర్‌ను పరామర్శించిన శేఖర్ మాస్టర్.. ఇప్పుడెలా ఉన్నాడో చూశారా?

ప్రముఖ డ్యాన్స్ మాస్టర్ పండు మాస్టర్ రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన సంగతి తెలిసిందే. కొన్ని రోజుల క్రితం ఓ ఈవెంట్ కు హాజరై వస్తుండగా ప్రమాదవశాత్తూ అతనిని ఓ వాహనం ఢీకొట్టింది. ఈ యాక్సిడెంట్ లో పండు మాస్టర్ కాళ్లకు తీవ్ర గాయాలయ్యాయి.

Pandu Master: పండు మాస్టర్‌ను పరామర్శించిన శేఖర్ మాస్టర్.. ఇప్పుడెలా ఉన్నాడో చూశారా?
Pandu Master, Sekhar Master
Basha Shek
|

Updated on: Jul 13, 2026 | 6:10 PM

Share

ఢీ ఫేమ్, ప్రముఖ డ్యాన్సర్ పండు మాస్టర్‌ ఈ మధ్యనే రోడ్డు ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. విశాఖపట్నం జిల్లా తగరపువలసలో జరిగిన ఓ ఈవెంట్ కు హాజరై హైదరాబాద్ కు వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఆనందపురం సమీపంలో కారు ఆపి రోడ్డు పక్కన నిలబడిన పండు మాస్టర్ ను వేగంగా వచ్చిన ఒక కోళ్ల వ్యాన్ అతనిని బలంగా ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో పండు మాస్టర్ రెండు కాళ్లు తీవ్రంగా దెబ్బ తిన్నాయి. దీంతో వెంటనే అతనిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందజేశారు. కెరీర్ పీక్ స్టేజ్ లో ఉన్నప్పుడు అందులోనూ సరిగ్గా కాళ్లకు తీవ్రమైన గాయాలు కావడం పండు మాస్టర్ అభిమానులను తీవ్ర ఆవేదనకు గురి చేసింది. అయితే డాక్టర్లు వెంటనే అవసరమైన సర్జరీ చేశారు. మొన్నటివరకు ఆస్పత్రిలోనే ఉన్న పండు మాస్టర్ ఇప్పుడు ఇంటికి చేరుకున్నాడు. తన నివాసంలోనే పూర్తిగా రెస్ట్ తీసుకుంటున్నాడు. ఈ నేపథ్యంలో ప్రముఖ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ పండు మాస్టర్ ను పరామర్శించారు. స్వయంగా పండు ఇంటికెళ్లిన శేఖర్ మాస్టర్, అతని ఆరోగ్య పరిస్థితిని, వైద్యులు అందిస్తున్న చికిత్స వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా చాలా సేపు పండు మాస్టర్ తో ఆత్మీయంగా మాట్లాడి ధైర్యం చెప్పారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు ఇప్పుడు నెట్టింట వైరలవుతున్నాయి.

కాగ శేఖర్ మాస్టర్ ను గురువులా భావిస్తాడు పండు మాస్టర్. ఢీ షోలో వీరిద్దరి మధ్య జరిగే కామెడీ ఓ రేంజ్ లో ఉంటుంది. ఓ సందర్భంలో శేఖర్ మాస్టర్ గురించి పండు మాట్లాడుతూ.. ‘ ఢీ’ షోలో తనకిష్టమైన జడ్జ్ శేఖర్ మాస్టరే అని చెప్పుకొచ్చాడు. శేఖర్ మాస్టర్ తనతో పాటు ప్రతి ఒక్క డ్యాన్సర్‌కూ సపోర్ట్ చేస్తాడని , ట్రోలింగ్‌కు గురవుతున్నప్పటికీ, ఆయన నిజాయితీగల వ్యక్తి అని ప్రశంసలు కురిపించాడు. ఈ క్రమంలోనే పండు మాస్టర్ ఇంటికి వెళ్లాడు శేఖర్ మాస్టర్. అతను త్వరగా కోలుకుని మళ్లీ అదిరిపోయే స్టెప్పులతో ప్రేక్షకులను అలరించాలని కోరుకుంటున్నాడు. ఇక ప్రస్తుతం పండు మాస్టర్ ఆరోగ్యం నిలకడగా ఉందని తెలుస్తోంది. త్వరలోనే అతను సాధారణ స్థితికి వస్తాడని వైద్యులు కూడా చెబుతున్నారు.

అంతకు ముందు నందు, స్టార్ యాంకర్ ప్రదీప్ మాచిరాజు తదితరుల బుల్లితెర సెలబ్రిటీలు పండు మాస్టర్ ను పరామర్శించారు. అతనికి అవసరమైన సహాయ సహకారాలు అందించారు. ముఖ్యంగా యాంకర్ ప్రదీప్ అయితే , పండు మాస్టర్ తండ్రి కి ఆపరేషన్ సమయం డబ్బు సహాయం కూడా చేసారని తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
నితిన్ గడ్కరీ సీరియస్ వార్నింగ్!
నితిన్ గడ్కరీ సీరియస్ వార్నింగ్!
వెయ్యి కోట్ల కల.. ఈ ఏడాదైనా తీరుతుందా..?
వెయ్యి కోట్ల కల.. ఈ ఏడాదైనా తీరుతుందా..?
2027 వన్డే వరల్డ్ కప్‌లో రోహిత్, కోహ్లీ ఆడటం ఖాయం.. గిల్ క్లారిటీ
2027 వన్డే వరల్డ్ కప్‌లో రోహిత్, కోహ్లీ ఆడటం ఖాయం.. గిల్ క్లారిటీ
మొదటి భర్తకు విడాకులు ఇవ్వకుండా రెండో పెళ్లి చేసుకుంటే మహిళకు..
మొదటి భర్తకు విడాకులు ఇవ్వకుండా రెండో పెళ్లి చేసుకుంటే మహిళకు..
పండు మాస్టర్‌ను పరామర్శించిన శేఖర్ మాస్టర్.. ఇప్పుడెలా ఉన్నాడంటే?
పండు మాస్టర్‌ను పరామర్శించిన శేఖర్ మాస్టర్.. ఇప్పుడెలా ఉన్నాడంటే?
కొత్త జంటలకు స్వర్గధామం..ఇండియన్స్ మెచ్చే రొమాంటిక్ డెస్టినేషన్
కొత్త జంటలకు స్వర్గధామం..ఇండియన్స్ మెచ్చే రొమాంటిక్ డెస్టినేషన్
రుచి చూడాల్సిందే.. హైదరాబాద్ స్టైల్‌లో చికెన్ మెజిస్టిక్స్
రుచి చూడాల్సిందే.. హైదరాబాద్ స్టైల్‌లో చికెన్ మెజిస్టిక్స్
ఓటీటీ కంటెంట్‌కు సెన్సార్‌ నిబంధనలు తెచ్చే ఆలోచనలో కేంద్రం
ఓటీటీ కంటెంట్‌కు సెన్సార్‌ నిబంధనలు తెచ్చే ఆలోచనలో కేంద్రం
ఓటీటీలో సస్పెన్స్ థ్రిల్లర్ రచ్చ .. అస్సలు మిస్ అవ్వకండి..
ఓటీటీలో సస్పెన్స్ థ్రిల్లర్ రచ్చ .. అస్సలు మిస్ అవ్వకండి..
ఓటీటీ హవాకు చెక్.. కమర్షియల్ సినిమాలతో థియేటర్లలో మళ్లీ జాతర!
ఓటీటీ హవాకు చెక్.. కమర్షియల్ సినిమాలతో థియేటర్లలో మళ్లీ జాతర!