‘తమ్ముడు’ని ఇమిటేట్ చేసిన ‘అన్నయ్య’..ఇది కదా ఫ్యాన్స్‌కి కావాల్సిన ఎమోషన్..

చిరంజీవి…తెలుగు చిత్రసీమలో మెగాస్టార్. ఇప్పటికీ ఆయన ఫ్యాన్ బేస్ ఏ మాత్రం చెక్కుచెదరలేదు. మాస్ పల్స్‌ని పట్టుకోవడంలో చిరంజీవిని మించిన స్టార్ మరొకరు లేరు. స్టెప్ వేయాలన్నా, ఫైట్ చేయాలన్నా, డైలాగ్ చెప్పాలన్నా..చిరు స్థాయి వేరు, స్థానం వేరు. ఇటీవల ‘సైరా’ తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిరంజీవి సాలిడ్ హిట్ ఇచ్చి వెళ్లారు. ఇక మెగాస్టార్ తమ్ముడు పవర్ స్టార్ గురించి ప్రత్యేకంగా చెప్పాలా?. ఆయనకో స్టైల్ ఉంటుంది.  సెపరేట్ మేనరిజమ్స్, టిపికల్ బాడీ లాంగ్వేజ్ […]

'తమ్ముడు'ని ఇమిటేట్ చేసిన 'అన్నయ్య'..ఇది కదా ఫ్యాన్స్‌కి కావాల్సిన ఎమోషన్..
Follow us
Ram Naramaneni

|

Updated on: Nov 27, 2019 | 8:18 AM

చిరంజీవి…తెలుగు చిత్రసీమలో మెగాస్టార్. ఇప్పటికీ ఆయన ఫ్యాన్ బేస్ ఏ మాత్రం చెక్కుచెదరలేదు. మాస్ పల్స్‌ని పట్టుకోవడంలో చిరంజీవిని మించిన స్టార్ మరొకరు లేరు. స్టెప్ వేయాలన్నా, ఫైట్ చేయాలన్నా, డైలాగ్ చెప్పాలన్నా..చిరు స్థాయి వేరు, స్థానం వేరు. ఇటీవల ‘సైరా’ తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిరంజీవి సాలిడ్ హిట్ ఇచ్చి వెళ్లారు. ఇక మెగాస్టార్ తమ్ముడు పవర్ స్టార్ గురించి ప్రత్యేకంగా చెప్పాలా?. ఆయనకో స్టైల్ ఉంటుంది.  సెపరేట్ మేనరిజమ్స్, టిపికల్ బాడీ లాంగ్వేజ్ వెరసి..పవన్ కళ్యాణ్. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో పవన్ క్రేజ్ ఏంటో అందరికి తెలిసిందే. ఆయన రాజకీయాల్లో బిజీ అయ్యి..సినిమాలకు దూరమైనా..పవర్ ఇంపాక్ట్ మాత్రం ఓ రేంజ్‌లో వ్యాపిస్తూనే ఉంది. ఇప్పుడు ఈ మెగా బ్రదర్స్ హాట్ టాపిక్‌గా మారారు.

మంగళవారం యంగ్ హీరో నిఖిల్ లేటెస్ట్ మూవీ అర్జున్ సురవరం ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమానికి చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అయితే మెగాస్టార్, పవర్ స్టార్ సిగ్నేచర్ స్టిల్‌ని స్టేజ్‌పై  అందరి ముందే ఇమిటేట్ చెయ్యడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. మెడపై చెయ్యిపెట్టి..పవర్‌పుల్ కళ్లతో కోపంగా చూసే సీన్..పవన్ కళ్యాణ్ చాలా సినిమాల్లో ఉంటుంది. ఈ మూమెంట్ థియేటర్లో కనిపిస్తే..ఆ రచ్చ మాములుగా ఉండదు. ఆ కాసేపు ఫ్యాన్స్‌ను అదుపుచెయ్యడం అసాధ్యం. ఆ స్టిల్‌ను మంగళవారం జరిగిన ఈవెంట్‌లో చిరంజీవి చేయడంతో ఒక్కసారిగా ఫ్యాన్స్ భావోద్వేగానికి గురయ్యారు. అర్జున్ సురవరం సినిమాలో చేగువేరాకు సంబంధించిన సాంగ్ ఉంటుంది. అది వింటున్నంతసేపు తన తమ్ముడు పవన్ కళ్యాణ్ గుర్తకు వచ్చారన్న మెగాస్టార్..అతని సిగ్నేచర్‌ మూమెంట్‌ స్టిల్ ఇచ్చి మెస్మరైజ్ చేశారు.