అవకాశం కోసం వెళ్తే.. ఓ నిర్మాత పడకగదికి రమ్మన్నాడు: హీరోయిన్ సంచలన కామెంట్స్..
అవకాశం కోసం వెళ్తే.. ఓ నిర్మాత పడకగదికి రమ్మన్నాడని.. హీరోయిన్ సంచలన కామెంట్స్ చేసింది. ఆమె ఎవరో కాదు. 'మీకు మాత్రమే చెప్తా' మూవీలో నటించిన...
అవకాశం కోసం వెళ్తే.. ఓ నిర్మాత పడకగదికి రమ్మన్నాడని.. హీరోయిన్ సంచలన కామెంట్స్ చేసింది. ఆమె ఎవరో కాదు. ‘మీకు మాత్రమే చెప్తా’ మూవీలో నటించిన వాణి బోజన్. ‘మీకుమాత్రమే చెప్తా’ చిత్రం ద్వారా డైరెక్టర్ తరుణ్ భాస్కర్‌ను హీరోగా పరిచయం చేశాడు.. విజయ్ దేవరకొండ. దీనికి సమీర్ దర్శకత్వం వహించారు. ఇందులో అనసూయ ఓ కీలక పాత్రలో కనిపించగా.. తరుణ్ భాస్కర్‌కి జోడీగా నటించిన వాణి బోజన్.. తాజాగా సంచలన కామెంట్స్ చేసింది.
కాగా ఈ భామ తాజాగా సినీ ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ గురించి మాట్లాడుతూ.. సంచలన ఆరోపణలు చేసింది. అవకాశం కోసం వెళ్తే.. ఓ నిర్మాత పడకగదికి రమ్మన్నాడని గుట్టు విప్పేసింది. ఓ ఇంటర్య్వూలో ఆమె ఎదుర్కొన్న అనుభవాలను బయటపెట్టింది. టెలివిజన్ నుంచి చిత్ర పరిశ్రమకు వస్తోన్న క్రమంలో తనకు చేదు అనుభవాలు ఎదురయ్యాయని పేర్కొంది. సినిమాలో అవకాశం కావాలంటే.. తనతో పడకగదికి రావాలంటూ ఓ నిర్మాత తనను ఇబ్బందిపెట్టాడంటూ పేర్కొంది. దాంతో.. ఆ ఆఫర్‌ను సున్నితంగా తిరస్కరించినట్లు ఆమె చెప్పింది. అయితే ప్రస్తుతం ఈ కామెంట్స్ తమిళ ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారాయి. కాగా వాణి తొలి సినిమా ‘ఓ మై కడవులే’ నటించగా.. అది సూపర్ హిట్ అయింది.
కాగా.. ‘మీటూ’ పేరుతో దేశ వ్యాప్తంగానే కాకుండా.. ప్రపంచ వ్యాప్తంగా పలు రంగాల్లో మహిళలు ఎదుర్కొంటున్న లైంగిక వేధింపులను వివిధ వేదికలపై చర్చిస్తోన్న సంగతి తెలిసిందే. అందులో భాగంగా సినీ పరిశ్రమలో ఓ ఉద్యమమే మొదలయ్యింది. ఇప్పటికే చాలా మంది నటీమణులు మీటూ పేరుతో తమకు ఎదురైన చేదు అనుభవాలను బహిర్గతం చేస్తున్నారు.
Read More this also: శభాష్ రోజమ్మా.. నీ టైమింగ్‌కి!
‘కరోనా’ రావడం మంచిదేనా? ఆ వైరస్ వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా!
రోజా ‘రచ్చబండ’కు దొరబాబు దంపతులు
షాకింగ్ న్యూస్: ఆస్ట్రేలియా క్రికెటర్‌కి కరోనా వైరస్..!
వాట్సాప్‌లో డిలీట్ చేసిన మెసేజ్‌లను చూడాలనుకుంటున్నారా? ఈ ట్రిక్ యూజ్ చేయండి