రేవంత్ వసూల్ రాజకీయాలు మానుకో.. టీఆర్ఎస్ ఎమ్మెల్యే
కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డిపై టీఆర్ఎస్ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. రేవంత్ ఇప్పటికైనా వసూల్ రాజకీయాలు మానుకోవాలన్నారు. ఐకియాలాంటి సంస్థలపై కేసులు వేసి.. హైదరాబాద్ ఇమేజ్‌ను దెబ్బతీయాలని చూస్తున్నారని ఆరోపించారు.ఐకియాకు ప్రభుత్వ మద్దతు ఉందని.. ఎలాంటి భయంలేదన్నారు గువ్వల బాలరాజు. రేవంత్ రెడ్డి చుట్టూ ఉచ్చు బిగుసుకుందని.. తప్పించుకోవడానికి ఇక వీలులేదన్నారు. బడా కంపెనీలపై కేసులు వేస్తూ.. డబ్బులు వసూలు చేయడం రేవంత్ రెడ్డికి అలవాటేనని.. గువ్వల బాలరాజు ఆరోపించారు. కాగా.. మంత్రి […]
కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డిపై టీఆర్ఎస్ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. రేవంత్ ఇప్పటికైనా వసూల్ రాజకీయాలు మానుకోవాలన్నారు. ఐకియాలాంటి సంస్థలపై కేసులు వేసి.. హైదరాబాద్ ఇమేజ్‌ను దెబ్బతీయాలని చూస్తున్నారని ఆరోపించారు.ఐకియాకు ప్రభుత్వ మద్దతు ఉందని.. ఎలాంటి భయంలేదన్నారు గువ్వల బాలరాజు. రేవంత్ రెడ్డి చుట్టూ ఉచ్చు బిగుసుకుందని.. తప్పించుకోవడానికి ఇక వీలులేదన్నారు. బడా కంపెనీలపై కేసులు వేస్తూ.. డబ్బులు వసూలు చేయడం రేవంత్ రెడ్డికి అలవాటేనని.. గువ్వల బాలరాజు ఆరోపించారు.
కాగా.. మంత్రి కేటీఆర్ లీజుకు తీసుకున్న స్థలంలో అక్రమంగా డ్రోన్ కెమెరాలతో చిత్రీకరించిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై రేవంత్ రెడ్డితో పాటుగా మరో ఏడు మందిపై కేసులు నమోదయ్యాయి. ఎయిర్ క్రాఫ్ట్ యాక్ట్ కింద కేసులు నమోదవ్వడంతో.. రేవంత్ రెడ్డిని పోలసులు అరెస్ట్ చేసి.. జైలుకు పంపారు. రేవంత్ రెడ్డి ప్రైవసీని దెబ్బతీసేలా చట్టాలను ఉల్లంఘించారని శుక్రవారం లోక్‌సభలో నామా నాగేశ్వర్ రావు కూడా చర్చించారు. రేవంత్ రెడ్డిని అక్రమంగా అరెస్ట్ చేశారన్న కాంగ్రెస్ ఎంపీలకు నామా కౌంటర్ ఇచ్చారు.