బీజేపీతో పొత్తా ? ఆ ప్రసక్తే లేదు, మాయావతి క్లారిటీ
బీజేపీతో తమ పార్టీ పొత్తు పెట్టుకునే ప్రసక్తే లేదని బహుజన్ సమాజ్ పార్టీ అధినేత్రి మాయావతి స్పష్టం చేశారు. ఆ పార్టీతో పొత్తు పెట్టుకునే బదులు తాను రాజకీయాలనుంచి వైదొలగుతానని అన్నారు. మతతత్వ పార్టీ అయిన కమలం పార్టీతో భవిష్యత్ లోనూ చేతులు కలపబోమని ఆమె చెప్పారు. బీజేపీది మత, కుల తత్వ, కేపిటలిస్ట్ ఐడియాలజీ అని మాయావతి నిప్పులు కక్కారు. భవిష్యత్తులో జరిగే ఎన్నికల్లో సమాజ్ వాదీ పార్టీ అభ్యర్థులు ఓడిపోయేలా చూసేందుకు తమ పార్టీ […]

బీజేపీతో తమ పార్టీ పొత్తు పెట్టుకునే ప్రసక్తే లేదని బహుజన్ సమాజ్ పార్టీ అధినేత్రి మాయావతి స్పష్టం చేశారు. ఆ పార్టీతో పొత్తు పెట్టుకునే బదులు తాను రాజకీయాలనుంచి వైదొలగుతానని అన్నారు. మతతత్వ పార్టీ అయిన కమలం పార్టీతో భవిష్యత్ లోనూ చేతులు కలపబోమని ఆమె చెప్పారు. బీజేపీది మత, కుల తత్వ, కేపిటలిస్ట్ ఐడియాలజీ అని మాయావతి నిప్పులు కక్కారు. భవిష్యత్తులో జరిగే ఎన్నికల్లో సమాజ్ వాదీ పార్టీ అభ్యర్థులు ఓడిపోయేలా చూసేందుకు తమ పార్టీ బీజేపీ లేదా మరే ఇతర పార్టీ క్యాండిడేట్ కి గానీ ఓటు వేస్తుందని గతవారం ఆమె పేర్కొన్నారు. విధాన పరిషత్ ఎన్నికలు జరిగినప్పుడు సమాజ్ వాదీకి చెందిన రెండో అభ్యర్థి ఓడిపోయేలా చూస్తామని ఆమె అన్నారు. ఏమైనా తన వ్యాఖ్యను సమాజ్ వాదీ, కాంగ్రెస్ పార్టీలు తమ రాజకీయ ప్రయోజనాలకోసం వక్రీకరించాయని ఆమె ఆరోపించారు. మెల్లగా మాయావతి బీజేపీ పట్ల మొగ్గు చూపుతున్నారని , రాష్ట్రంలో రాజ్యసభ ఎన్నికల్లో విపక్ష పార్టీల మద్దతు కోరకుండా అభ్యర్థిని నిలబడుతున్నారని సమాజ్ వాదీ ఇటీవల ఆరోపించింది. అయితే ఈ ఆరోపణను ఆమె ఖండించారు.



