AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

శివుడి స్పర్శ కోసమేనా..? నంది చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్న నాగుపాము.. వీడియో వైరల్!

అది మహత్యమో..! యాదృశ్చికమో.! గానీ గతవారం రోజులుగా ఆ ఆలయంలో నాగుపాము హల్చల్ చేస్తోంది. ఏడు అడుగుల నాగుపాము గర్భగుడి ముందు సంచరిస్తూ ఆలయ సిబ్బందిని పరుగులు పెట్టిస్తుంది. శైవక్షేత్రంలో నాగుపాము సంచారం శివుడి మహత్యమే అని ఆలయ పూజారులు భావిస్తున్నారు. ఈ అద్భుత ఘటన జనగామ జిల్లాలో వెలుగు చూసింది.

శివుడి స్పర్శ కోసమేనా..? నంది చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్న నాగుపాము.. వీడియో వైరల్!
Cobra Performs In Temple
G Peddeesh Kumar
| Edited By: |

Updated on: Apr 10, 2026 | 4:32 PM

Share

అది మహత్యమో..! యాదృశ్చికమో.! గానీ గతవారం రోజులుగా ఆ ఆలయంలో నాగుపాము హల్చల్ చేస్తోంది. ఏడు అడుగుల నాగుపాము గర్భగుడి ముందు సంచరిస్తూ ఆలయ సిబ్బందిని పరుగులు పెట్టిస్తుంది. శైవక్షేత్రంలో నాగుపాము సంచారం శివుడి మహత్యమే అని ఆలయ పూజారులు భావిస్తున్నారు. ఈ అద్భుత ఘటన జనగామ జిల్లాలో వెలుగు చూసింది. ఈ దృ‌శ్యాన్ని చూసేందుకు స్థానిక భక్తులు బారులు తీరుతున్నారు.

పాలకుర్తి మండల కేంద్రంలోని ప్రముఖ పుణ్య క్షేత్రమైన శ్రీ సోమేశ్వర లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో భారీ నాగుపాము పరుగులు పెట్టిస్తుంది. గతవారం రోజులుగా పాము ప్రదక్షిణలు కలకలం రేపుతున్నాయి. ఆలయ గర్భగుడి ద్వారం, నందీశ్వరుడి చుట్టూ నాగుపాము పడగ విప్పి గిరి ప్రదక్షిణలు చేస్తూ భక్తులకు కనిపిస్తోంది. ఇంత పెద్ద నాగుపాము పడగ విప్పి కనిపించడంతో స్వామివారు పాము రూపంలో దర్శనమిచ్చారని భక్తులు భక్తి పారవశ్యానికి లోనవుతున్నారు. ఆలయ సిబ్బంది పామును చూసి పరుగులు పెడుతున్నారు.

ప్రతి రోజూ ఉదయాన్నే ఆలయంలోకి వస్తున్న నాగుపాము నంది విగ్రహం వద్ద ప్రదక్షిణలు చేసి కొంతసేపు అక్కడే సేద తీరుతుంది. ఆ తర్వాత కొద్దిసేపటికి మెట్ల మార్గాన కిందికి వెళ్తూ.. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడి వెనక ఉన్న పుట్టలోకి వెళుతుందని ఆలయ సిబ్బంది తెలిపారు. పాము తనను పిలిచినట్లుగా ఉదయాన్నే వచ్చి మధ్యాహ్నం వరకు తిరిగి మళ్లీ పుట్టలోకి వెళ్లడం దైవ మహత్యమని ఇక్కడ పూజారులు, ఆలయ సిబ్బంది, భక్తులు భావిస్తున్నారు. కానీ అంత పెద్ద పామును చూసి వారంతా ఒకవైపు భక్తి.. మరోవైపు తీవ్ర భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు.

వీడియో ఇక్కడ చూడండి..

మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…

Follow Us