AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: ఇన్‌స్టాలో క్లాస్‌మేట్ వేధింపులు.. పదో తరగతి విద్యార్థిని చేసిన పనికి అంతా షాక్

హయత్‌నగర్ పరిధిలోని కుంట్లూరులో దారుణ ఘటన చోటుచేసుకుంది. తోటి విద్యార్థి వేధింపులకు తట్టుకోలేక 10వ తరగతి చదువుతున్న బాలిక ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన సంఘటన తీవ్ర స్థానికంగా కలకలం రేపుతోంది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Hyderabad: ఇన్‌స్టాలో క్లాస్‌మేట్ వేధింపులు.. పదో తరగతి విద్యార్థిని చేసిన పనికి అంతా షాక్
Hyderabad Crime
Ranjith Muppidi
| Edited By: |

Updated on: Apr 10, 2026 | 3:14 PM

Share

తోటి విద్యార్థి వేధింపులకు తట్టుకోలేక 10వ తరగతి విద్యార్థిని ఆత్మత్యకు పాల్పడిన ఘటన హైదరాబాద్‌లో వెలుగు చూసింది. వివరాల్లోకి వెళ్తే.. కుంట్లూరులోని ఓ ప్రైవేట్ పాఠశాలలో చదువుతున్న బాలిక, అదే స్కూల్‌కు చెందిన ఓ బాలుడితో పరిచయం పెంచుకుంది. అయితే ఆ స్నేహాన్ని దుర్వినియోగం చేస్తూ, ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఆ బాలుడు ఆమెను లైంగికంగా వేధించినట్లు తెలుస్తోంది. పలుమార్లు మందలించినా అతడి ప్రవర్తనలో మార్పు రాకపోవడంతో, అతని నుంచి వేధింపులు పెరగడంతో తీవ్ర మానసిక ఒత్తిడికి గురైన విద్యార్థిని సంచలన నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం.

ఈ నేపథ్యంలో గురువారం ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి.. ఇంట్లోని ఫ్యాక్‌కు ఉరివేసుకుని బాలిక ఆత్మహత్యకు పాల్పడినట్టు తెలుస్తోంది. ఇంట్లో ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించిన బాలికను చూసిన కుటుంబ సభ్యులు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. మృతదేహాన్ని తమ సొంత గ్రామానికి తీసుకెళ్లారు. అయితే విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే స్పందించి, సాగర్ ప్రాంతం నుంచి మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం తిరిగి హైదరాబాద్‌కు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ఈ ఘటనతో ప్రాంతంలో ఆవేదన నెలకొనగా.. విద్యార్థుల భద్రత, సామాజిక మాధ్యమాల్లో వేధింపులపై మరోసారి ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. పోలీసులు అన్ని కోణాల్లో విచారణ కొనసాగిస్తున్నారు. పిల్లల సోషల్ మీడియా వినియోగం పట్ల పేరెంట్స్ అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. కౌమర దశలో వారు చాలా సెన్సిటివ్‌గా ఉంటారని.. వారిని కనిపెట్టాల్సిన బాధ్యత తల్లిదండ్రులతో పాటు టీచర్స్‌పై ఉంటుందంటున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
ఇరాన్‌తో యుద్ధంపై అమెరికా వైట్‌హౌస్ కీలక ప్రకటన
ఇరాన్‌తో యుద్ధంపై అమెరికా వైట్‌హౌస్ కీలక ప్రకటన
గుడ్‌న్యూస్‌.. కొత్త సబ్ స్టేషన్ల నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్..
గుడ్‌న్యూస్‌.. కొత్త సబ్ స్టేషన్ల నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్..
ఒక్కసారిగా మీ సెల్‌ఫోన్‌లో బీప్ సౌండ్ రావచ్చు.. టెన్షన్‌ వద్దు
ఒక్కసారిగా మీ సెల్‌ఫోన్‌లో బీప్ సౌండ్ రావచ్చు.. టెన్షన్‌ వద్దు
జైపూర్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జైత్రయాత్ర.. రాజస్థాన్‌పై ఘనవిజయం
జైపూర్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జైత్రయాత్ర.. రాజస్థాన్‌పై ఘనవిజయం
సొంత తెలివి సున్నా.. బిల్డప్ లో మాత్రం పీహెచ్‌డీ
సొంత తెలివి సున్నా.. బిల్డప్ లో మాత్రం పీహెచ్‌డీ
శరీరం ఇచ్చే ఈ చిన్న సంకేతాలను లైట్ తీసుకోవద్దు..
శరీరం ఇచ్చే ఈ చిన్న సంకేతాలను లైట్ తీసుకోవద్దు..
5364 మీటర్ల ఎత్తులో తెలుగు తేజాలు.. ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌ను..
5364 మీటర్ల ఎత్తులో తెలుగు తేజాలు.. ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌ను..
క్యారెట్-వెల్లుల్లి సాంబార్.. అన్నంలోకి అదిరిపోయే రుచి, ఆరోగ్యం
క్యారెట్-వెల్లుల్లి సాంబార్.. అన్నంలోకి అదిరిపోయే రుచి, ఆరోగ్యం
ఏపీలో భద్రాచలం.. ఆందోళనలో ప్రజలు.. జన గణన సైట్‌లో బిగ్ ట్విస్ట్..
ఏపీలో భద్రాచలం.. ఆందోళనలో ప్రజలు.. జన గణన సైట్‌లో బిగ్ ట్విస్ట్..
ఫోన్ సైలెంట్‏లో పెట్టి ఎక్కడో పోగొట్టుకున్నారా.. ?
ఫోన్ సైలెంట్‏లో పెట్టి ఎక్కడో పోగొట్టుకున్నారా.. ?