అక్కడ పరీక్షల్లో యధేచ్చగా మాస్ కాపీయింగ్
అసలే డిస్టెన్స్ ఎడ్యుకేషన్ ఎగ్జామ్స్. విద్యార్థులు కూడా ఓపెన్‌గా రాసేస్తున్నారు. కోవిడ్ నిబంధనలు పక్కనపెట్టీ ఎగ్జామ్స్ నిర్వాహకులు కూడా వారికి సహకరిస్తున్నారు. ఇంకేముంది..చెలరేగిపోయారు. కొందరైతే అడ్వాన్స్ టెక్నాలజీతో మొబైల్ ఫోన్‌లో చూస్తూ ఎగ్జామ్స్ రాసేస్తున్నారు. భద్రాద్రి కొత్తగూడెంజిల్లా పాల్వంచలోని రవి ఐటీఐ కాలేజ్ లో ఎగ్జామ్స్ నిర్వహణా తీరిది. అక్కడ నాగార్జున యూనివర్శిటీ ఓపెన్ డిస్టెన్స్ ఎగ్జామ్స్ పరీక్షలు విద్యార్థుల ఇష్టానికి జరుగుతున్నాయి. పాల్వంచ శివారులో ఉన్న ఈ ఐటీఐ కాలేజీ సెంటర్‌లో విద్యార్థులు ఓపెన్‌గానే మాస్ […]

అసలే డిస్టెన్స్ ఎడ్యుకేషన్ ఎగ్జామ్స్. విద్యార్థులు కూడా ఓపెన్‌గా రాసేస్తున్నారు. కోవిడ్ నిబంధనలు పక్కనపెట్టీ ఎగ్జామ్స్ నిర్వాహకులు కూడా వారికి సహకరిస్తున్నారు. ఇంకేముంది..చెలరేగిపోయారు. కొందరైతే అడ్వాన్స్ టెక్నాలజీతో మొబైల్ ఫోన్‌లో చూస్తూ ఎగ్జామ్స్ రాసేస్తున్నారు. భద్రాద్రి కొత్తగూడెంజిల్లా పాల్వంచలోని రవి ఐటీఐ కాలేజ్ లో ఎగ్జామ్స్ నిర్వహణా తీరిది. అక్కడ నాగార్జున యూనివర్శిటీ ఓపెన్ డిస్టెన్స్ ఎగ్జామ్స్ పరీక్షలు విద్యార్థుల ఇష్టానికి జరుగుతున్నాయి. పాల్వంచ శివారులో ఉన్న ఈ ఐటీఐ కాలేజీ సెంటర్‌లో విద్యార్థులు ఓపెన్‌గానే మాస్ కాపీయింగ్‌కు పాల్పడుతున్నారు. కొందరు పుస్తకాలు ముందుపెట్టుకుని రాస్తే..మరికొందరు సెల్‌ఫోన్‌లో ఆన్సర్స్ చూస్తూ రాసేస్తున్నారు. విద్యార్థులు పుస్తకాలు పెట్టుకుని రాస్తున్నా…ఇన్విజిలేటర్స్ ఎవ్వరూ అభ్యంతరం చెప్పలేదు. దాంతో మరింత చెలరేగిపోయి పేజీలకొద్దీ ఆన్సర్లు రాసేశారు విద్యార్థులు. ఎగ్జామ్స్ నిర్వాహకులే ఒక్కో విద్యార్థి దగ్గర సబ్జెక్ట్‌కు వేల రూపాయలు వసూలు చేసినట్టు సమాచారం. దాంతో మాస్ కాపీయింగ్‌ను ప్రోత్సహించినట్టు విద్యార్థి సంఘాల నేతలు ఆరోపిస్తున్నారు. ఇంత జరుగుతున్నా…అధికారులు తమకేం తెలియనట్టు వ్యవహరిస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి ఎగ్జామ్స్ ను రద్దు చేయాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తు్న్నాయి.



