ఫలప్రదం దిశగా ఆర్టీసీ చర్చలు.. రేపటి నుంచి రోడ్డెక్కనున్న బస్సులు..!

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా నేపథ్యంలో ప్రజా రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించింది. కొవిడ్ పాజిటివ్ కేసులు తగ్గుముఖం పడుతుండటంతో కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన వెసులుబాటుతో అంతర్రాష్ట్ర రవాణా వ్యవస్థ గాడిలో పట్టేందుకు ఆర్టీసీ సన్నద్ధమైంది.

ఫలప్రదం దిశగా ఆర్టీసీ చర్చలు.. రేపటి నుంచి రోడ్డెక్కనున్న బస్సులు..!

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా నేపథ్యంలో ప్రజా రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించింది. కొవిడ్ పాజిటివ్ కేసులు తగ్గుముఖం పడుతుండటంతో కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన వెసులుబాటుతో అంతర్రాష్ట్ర రవాణా వ్యవస్థ గాడిలో పట్టేందుకు ఆర్టీసీ సన్నద్ధమైంది. కానీ, ఎప్పరూ ఊహించని విధంగా రెండు తెలుగు రాష్ట్రాల రవాణా వ్యవస్థలో ప్రతిష్టంభన కొనసాగుతూ వస్తోంది. దసరా పండుగ సందర్బంగా ప్రతిష్టంభన తొలగి రెండు రాష్ట్రాల మద్య బస్సులు తిప్పాలని అధికారులు భావించారు. అయితే రెండు రెండు తెలుగు రాష్ట్రాల ఆర్టీసీ మద్య అవగాహన కుదరక పోవడంతో బస్సులు డిపోలేకే పరిమితమయ్యాయి. దీంతో అటు ఆంధ్ర, ఇటు తెలంగాణ రాష్ట్రాలకు చెందిన ప్రయాణీకులు అనేక ఇబ్బందులకు గురయ్యారు.

కాగా, రెండు తెలుగు రాష్ట్రాల మద్య తాజాగా జరుగుతున్న చర్చలు ఫలప్రదంగా సాగుతున్నట్టు తెలుస్తోంది. ప్రజా రవాణా పునరుద్దరణకు రెండు రాష్ట్రాల అధికారులు ఓ మెట్టు దిగడంతో ఇద్దరి మధ్య ఒప్పందాలు కుదరడంతో తిరిగి ఆర్టీసీ బస్సులు రోడ్డెక్కనున్నాయి. ఆంధ్రప్రదేశ్ ఆర్టీసీ అధికారుల ప్రతిపాదనలను తిరస్కరించిన తెలంగాణ సర్కార్.. నష్టమని తెలిసినా పట్టు సడలించుకున్న ఏపి.. సోమవారం జరిగిన ఇరురాష్ట్రాల రవాణ శాఖ ఉన్నతాదికారుల చర్చలు కొలిక్కి వచ్చినట్లు సమాచారం.
మంగళవారం నుండి అంతర్రాష్ట్ర బస్సు సర్వీసులు పునఃప్రారంభం కానున్నాయి.

తెలంగాణలో ఏపీ బస్సులు, ఏపీలో తెలంగాణ ఆర్టీసీ బస్సులు ప్రత్యక్షమతాయి. ఏపీఎస్ఆర్టీసీ, టీఎస్ఆర్టీసీ అధికారుల మధ్య కుదిరిన అవగాహన మేరకు, తెలంగాణ ఆర్టీసీ ఏపీ పరిధిలో 1,61,258 కిలోమీటర్ల మేర బస్సులను తిప్పేందుకు నిర్ణయం తీసుకుంది. అదే ఏపీ తెలంగాణ పరిధిలో 1,60,919 కిలోమీటర్ల మేర తన బస్సుల్ని నడిపేందుకు సుముఖత వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. లాక్‌డౌన్ ముందు వరకు ఏపీ బస్సులు 2,65,367 కిలోమీటర్లు తన బస్సుల్ని తెలంగాణ పరిధిలో నడపగా, తాజా ప్రతిపాదనల మేరకు లక్షకు పైగా కిలోమీటర్లలో కోతపడనుంది. అంతే కాకుండా అమరావతి హైదరాబాద్ మార్గంపై తెలంగాణ రవాణా అధికారులు సూచించిన ప్రతిపాదనలే అమలు కాబోతున్నట్టు తెలుస్తోంది. ఇప్పటి వరకు ఈ మార్గంలో ఏపీ 374 బస్సులను నడుతుండగా, తాజా నిబంధనల ప్రకారం వాటి సంఖ్య 192కి తగ్గించుకోబోతున్నారు. తెలంగాణ బస్సులు ఇప్పటి వరకూ ఈ రూట్ లో కేవలం 162 మాత్రమే తిరిగేవి. కొత్త ఒప్ప్ందం మేరకు ఇకపై ఆ సంఖ్య 273కి పెరుగనున్నట్లు సమాచారం.

ఇక, కర్నూల్ సెక్టార్ లో 25వేలు, భద్రాచలం సెక్టార్ లో 13వేల కిలోమీటర్ల మేర ఏపీ బస్సు సర్వీసుల్ని తగ్గించుకుంటోంది. రెండు తెలుగు రాష్ట్రాల ప్రయాణికుల ఇబ్బందుల దృష్ట్యా ఏపీ వెనక్కు తగ్గినట్టు అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఫలప్రదం దిశగా చర్చలు.. వీలైతే రేపటినుండి బస్సులు తిరిగే అవకాశం కనిపిస్తుంది. తాము బస్సుల సంఖ్య తగ్గించుకునే ప్రసక్తే లేదని, కావాలంటే తెలంగాణ ఆర్టీసీ బస్సుల సంఖ్య పెంచుకోవచ్చని ఇప్పటి వరకూ ఏపీ ప్రభుత్వం వాదిస్తూ వచ్చింది. కాని ఈ ప్రతిపాదనకు తెలంగాణ అధికారుల నుండి సానుకూల స్పందన రాలేదు. దీంతో తెలంగాణ ప్రతిపాదనలకే ఆమోదం తెలపాలని ఏపీ నిర్ణయం తీసుకుంది. కొత్త నిబంధనలతో వచ్చే నష్టాన్ని భర్తీ చేసుకునేందుకు ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా ఆదాయం పెంచుకునే అవకాశాలను ఏపీ ప్రభుత్వం పరిశీలిస్తోంది.

Click on your DTH Provider to Add TV9 Telugu