#COVID19 కరోనా ఎఫెక్ట్… ఆ జంట పెళ్ళి అక్కడ జరిగింది

తిరుమల-తిరుపతి మధ్య దారిలో అత్యంత కీలకమైన అలిపిరి టోల్ గేటు వద్ద శనివారం ఆసక్తికర సంఘటన జరిగింది. అలిపిరి గరుడ విగ్రహం వద్ద పోలీసులు ఓ వివాహం జరిపించడం చర్చనీయాంశమైంది.

#COVID19 కరోనా ఎఫెక్ట్... ఆ జంట పెళ్ళి అక్కడ జరిగింది
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Mar 21, 2020 | 5:45 PM

కరోనా ప్రభావం ఇక్కడా అక్కడా అన్న తేడా లేకుండా.. సర్వత్రా కనిపిస్తోంది. రవాణాపై తీవ్ర ప్రభావం చూపుతోంది. దేవాలయాలు, మసీదు, చర్చీలకు వెళ్ళే భక్తులకు నో బోర్డులు దర్శనమిస్తున్నాయి. ఈ క్రమంలో తిరుమలలో పెళ్ళి చేసుకుందామని వచ్చిన ఓ ప్రేమ జంటకు తిరుపతిలో వింత అనుభవం ఎదురైంది.

సుమారు 130 ఏళ్ళ తర్వాత తిరుమల శ్రీవారి దర్శనాలకు బ్రేక్ వచ్చిన సంగతి తెలిసిందే. వారం రోజుల పాటు తిరుమల శ్రీవారి ఆలయంలోకి భక్తుల రాకను నిషేధించారు. కరోనా ప్రభావంతో తిరుమల ఇపుడు బోసి పోయి కనిపిస్తోంది. విషయం ఇంకా తెలియని వారు తిరుమల శ్రీవారి సన్నిధికి వస్తూనే వున్నారు. ఈ క్రమంలో తిరుమల వెళ్ళే అలిపిరి టోల్ గెట్ వద్ద ఆసక్తికర ఘటన జరిగింది.

శనివారం నాడు తిరుమలలో పెళ్లి చేసుకోవాలని కృష్ణా జిల్లా అవనిగడ్డకు చెందిన ఓ పెళ్ళి జంట వచ్చింది. తిరుమలకు అనుమతి లేకపోవడంతో శ్రీవారి ప్రతినిధిగా పెళ్ళి పెద్దగా తిరుపతి ఎస్సీ ఎస్టీ సెల్ డిఎస్పీ నాగా సుబ్బన్న సాయం కోరింది పెళ్ళి బృందం. దాంతో తిరుపతి అర్బన్ పోలీసులు ఆ జంటకు వివాహం జరిపించారు. అలిపరి గరుడ విగ్రహం వద్దే పెళ్ళి చేసుకుంది కొత్త జంట. భక్తుల కోరిక మేరకు పెద్ద మనసుతో పోలీసులే పెళ్ళికి పెద్దలుగా మారడం చర్చనీయాంశమైంది. గరుడ విగ్రహం సాక్షిగా రోడ్డు మీదే పెళ్లిని వైభవంగా జరిపించిన పోలీసులను పలువురు అభినందించారు.