AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కరోనా.. మహారాష్ట్రలో అధికం.. కేరళలోనూ పెరిగిన కేసులు

ఇండియాలో కరోనా కేసులు 275 కి పెరిగినట్టు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. కొత్తగా మహారాష్ట్రలో 53 కేసులు, కేరళలో 40 కేసులు నమోదయ్యాయి

కరోనా.. మహారాష్ట్రలో అధికం.. కేరళలోనూ పెరిగిన కేసులు
Umakanth Rao
| Edited By: |

Updated on: Mar 21, 2020 | 2:05 PM

Share

ఇండియాలో కరోనా కేసులు 275 కి పెరిగినట్టు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. కొత్తగా మహారాష్ట్రలో 53 కేసులు, కేరళలో 40 కేసులు నమోదయ్యాయి. పంజాబ్, రాజస్తాన్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో ఒక్కొక్కటి చొప్పున కేసులు బయటపడ్డాయి. ఈ నెల 21 వరకు ఢిల్లీ, కర్ణాటక, మహారాష్ట్ర, పంజాబ్ రాష్ట్రాల్లో ఒక్కొక్కరు కరోనాకు    గురై మరణించారని, అయితే పలు రాష్ట్రాలు ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్న ఫలితంగా ఈ వైరస్ కి గురై చికిత్స పొంది డిశ్చార్జి అవుతున్న రోగులు కూడా ఉన్నారని ఆరోగ్య శాఖ తెలిపింది. దేశంలో యాక్టివ్ గా ఉన్న కేసులు 231 అని, 22 మందికి పాజిటివ్ అని తేలినప్పటికీ వారు డిశ్చార్జి అయ్యారని ఈ శాఖవర్గాలు పేర్కొన్నాయి. మహారాష్ట్రలో అయిదుగురు, ఢిల్లీలో మరో అయిదుగురు కూడా చికిత్స అనంతరం ఆసుపత్రుల నుంచి డిశ్చార్జి అయినట్టు తెలిసింది. ఢిల్లీలో 26 కేసులు, యూపీలో 25, రాజస్థాన్ లో 23, తెలంగాణాలో 20, హర్యానాలో 17, కర్ణాటకలో 16, లడఖ్ లో 13, గుజరాత్ లో 8, చండీగఢ్ లో 5,  జమ్మూ కాశ్మీర్, మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో నాలుగు చొప్పున కేసులు నమోదయ్యాయి. తాజాగా  ఏపీ, పంజాబ్, తమిళనాడు, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో ఒక్కొక్కటి చొప్పున నమోదు కాగా. తమిళనాడులో ఒకరు చికిత్స పొంది డిశ్చార్జ్ అయ్యారు. హిమాచల్, ఒడిశా రాష్ట్రాల్లో రెండు, పుదుచ్ఛేరి, ఛత్తీస్ గడ్ రాష్ట్రాల్లో ఒక్కొకటి చొప్పున నమోదైనట్టు కేంద్రం ప్రకటించింది.

Follow Us
ఏపీలో మరో కొత్త రైల్వే లైన్.. మరో ముందడుగు
ఏపీలో మరో కొత్త రైల్వే లైన్.. మరో ముందడుగు
కండక్టర్‌తో పని లేకుండా యాప్‌లోనే టికెట్ పొందొచ్చు.. ఎలా అంటే..?
కండక్టర్‌తో పని లేకుండా యాప్‌లోనే టికెట్ పొందొచ్చు.. ఎలా అంటే..?
ఓటీటీలో రేణూ దేశాయ్ 'కాశీ మజిలీ'.. గుండెను తాకే ఈ పాట విన్నారా?
ఓటీటీలో రేణూ దేశాయ్ 'కాశీ మజిలీ'.. గుండెను తాకే ఈ పాట విన్నారా?
గ్రూప్ దశ తర్వాతే అసలు ఆట.. వరల్డ్‌కప్‌లో ‘సూపర్-7’ స్టేజ్ ఏంటంటే
గ్రూప్ దశ తర్వాతే అసలు ఆట.. వరల్డ్‌కప్‌లో ‘సూపర్-7’ స్టేజ్ ఏంటంటే
ఆసియా గేమ్స్‌లో భారత్‌కు స్వర్ణ పతకాల పంట.. ఒక్కరోజే 4
ఆసియా గేమ్స్‌లో భారత్‌కు స్వర్ణ పతకాల పంట.. ఒక్కరోజే 4
హైదరాబాద్‌లో పాకిస్తాన్‌ కాస్మెటిక్స్‌ కలకలం..!
హైదరాబాద్‌లో పాకిస్తాన్‌ కాస్మెటిక్స్‌ కలకలం..!
ఏపీ, తెలంగాణకు రెయిన్ అలర్ట్.. వాతావరణశాఖ హెచ్చరిక
ఏపీ, తెలంగాణకు రెయిన్ అలర్ట్.. వాతావరణశాఖ హెచ్చరిక
రెండో గోల్డ్ మెడల్ కొట్టేందుకు సిద్ధమవుతున్న ఐదుగురు స్టార్స్
రెండో గోల్డ్ మెడల్ కొట్టేందుకు సిద్ధమవుతున్న ఐదుగురు స్టార్స్
రైల్వేలో భారీఉద్యోగ నోటిఫికేషన్‌.. టెన్త్ మార్కులతో నేరుగా జాబ్స్
రైల్వేలో భారీఉద్యోగ నోటిఫికేషన్‌.. టెన్త్ మార్కులతో నేరుగా జాబ్స్
SSC కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల పరీక్షల షెడ్యూల్ 2026 వచ్చేసిందోచ్..
SSC కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల పరీక్షల షెడ్యూల్ 2026 వచ్చేసిందోచ్..