విశాఖ జిల్లాలో రూ.3.85 కోట్ల గంజాయి పట్టివేత…తరలింపు కోసం ప్రత్యేకంగా డిజైన్ చేసిన వాహనాలు..కేటుగాళ్ల రూటే సెపరేట్
విశాఖ జిల్లా గంజాయి అక్రమ రవాణాకు అడ్డాగా మారింది. పోలీసులు చర్యలు తీసుకుంటున్నా..కేటుగాళ్లు తగ్గడం లేదు. పొగాకు మాదిరి గంజాయిని సరఫరా చేయడం గమనార్హం. కాగా ఏపీలో యువత భారీ ఎత్తున గంజాయికి బానిసగా మారిందని తెలుస్తోంది.
విశాఖ జిల్లా గంజాయి అక్రమ రవాణాకు అడ్డాగా మారింది. పోలీసులు చర్యలు తీసుకుంటున్నా..కేటుగాళ్లు తగ్గడం లేదు. పొగాకు మాదిరి గంజాయిని సరఫరా చేయడం గమనార్హం. కాగా ఏపీలో యువత భారీ ఎత్తున గంజాయికి బానిసగా మారిందని తెలుస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో పట్టబడుతోన్న గంజాయిని బట్టి దాని వినియోగం ఏ రేంజ్ లో ఉందో అర్థం చేసుకోవచ్చు. తాజాగా విశాఖ జిల్లాలో 1,925 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నామని రాష్ట్ర డీఆర్‌ఐ(డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్) అధికారులు తెలిపారు. ఈ నెల 21వ తేదీన ఓ టాటా కంటైనర్ ట్రక్‌లో గంజాయి తరలిస్తున్నారన్న ముందస్తు సమాచాంతో తనిఖీలు నిర్వహించినట్లు చెప్పారు. ఈ క్రమంలో నిఘా పెట్టి విశాఖ జిల్లా అగనంపూడి టోల్‌గేటు దగ్గర ఆ వాహనాన్ని గుర్తించామని వెల్లడించారు.
గంజాయి రవాణాకు వీలుగా డ్రైవర్ సీటు వెనక భాగంలో, పై భాగంలో ప్రత్యేకంగా అరలు తయారు చేయించిన్లు వివరించారు. భద్రాచలంలో ఆ ట్రక్‌ను లోడ్ చేసి అలహాబాద్ తీసుకెళ్తున్నట్లు విచారణలో వెల్లడైందన్నారు. గంజాయిని, వాహనాన్ని స్వాధీనం చేసుకుని డ్రైవర్‌ను అరెస్టు చేసినట్లు వివరించారు. స్వాధీనం చేసుకున్న గంజాయి విలువ 3.85 కోట్ల రూపాయలు ఉంటుందని తెలిపారు.
Also Read :