రైతుల ఆందోళనలపై మంచు విష్ణు స్పందన..అటు తండ్రిని పొగుడుతూ, ఇటు అన్నదాలకు మద్దతుగా

ఈ మధ్య సినిమాల విషయంలో కాస్త స్లో అయినా.. సోషల్ మీడియాలో మాత్రం యమా యాక్టివ్‌గా ఉంటున్నారు మంచు విష్ణు.

  • Ram Naramaneni
  • Publish Date - 9:19 pm, Fri, 11 December 20
రైతుల ఆందోళనలపై మంచు విష్ణు స్పందన..అటు తండ్రిని పొగుడుతూ, ఇటు అన్నదాలకు మద్దతుగా

ఈ మధ్య సినిమాల విషయంలో కాస్త స్లో అయినా.. సోషల్ మీడియాలో మాత్రం యమా యాక్టివ్‌గా ఉంటున్నారు మంచు విష్ణు. తన పర్సనల్‌ విషయాల నుంచి సోషల్ ఇష్యూస్ వరకు ప్రతీ టాపిక్ మీద తనదైన స్టైల్‌ రియాక్ట్ అవుతున్నారు. లేటెస్ట్‌గా తండ్రి మోహన్‌ బాబు గురించి ఓ ఇంట్రస్టింగ్ కామెంట్‌ చేశారు విష్ణు… ‘మా నాన్నను చూస్తే జలస్‌గా ఉంది… ఆ రేంజ్‌ నా కెప్పుడు రావాలి’ అని కాస్త సీరియస్‌గానే కామెంట్ చేశారు.

ఇంతకీ తండ్రిని చూసి విష్ణు… ఎందుకు జలస్‌ ఫీల్ అవుతున్నారు అనేగా మీ డౌట్‌..? అక్కడికే వస్తున్నాం. ఆ విషయం  ‘అడివిలో అన్న’ సినిమాలో మోహన్ బాబు చెప్పిన ఓ సీరియస్‌ డైలాగ్‌ను షేర్ చేసిన విష్ణు.. కలెక్షన్‌ కింగ్‌ డైలాగ్‌ డెలివరీకి సాహో అన్నారు. కావాలంటే ఆ డైలాగ్ మీరూ చూడండి.. మీకు కూడా అదే ఫీలింగ్ కలుగుతుంది.

ఈ డైలాగ్‌నే తన ట్విటర్‌ పేజ్‌లో షేర్ చేసిన విష్ణు… ‘నాన్న రేంజ్‌ నాకెప్పుడు రావాలి.. అందుకే జలస్‌గా ఉంది’ అంటూ కామెంట్ చేశారు.. ఈ మధ్య రైతు ఉద్యమానికి మద్ధతుగా ట్వీట్లు చేస్తున్న విష్ణు.. తాజాగా మోహన్‌ బాబు డైలాగ్‌తో మరోసారి తాను ఫార్మర్స్‌ సైడే అంటూ హింట్‌ కూడా ఇచ్చారు. ఒక్క దెబ్బకు రెండు పిట్టలనన్నట్టు ఒక్క ట్వీట్‌తో రెండు లాభాలన్న మాట.. అది మంచు హీరో స్ట్రాటజీ.

Also Read :

అగ్గితో ఆటలొద్దు..సీఎం మమతా బెనర్జీకు గవర్నర్ జగ్​దీప్​​ ధనకర్ డైరెక్ట్ వార్నింగ్

రైతులకు ఆదాయం పెంచే విధానాలపై ఫోకస్ పెట్టండి, బ్యాంకర్లకు సీఎం జగన్ సూచన

బుమ్రా కొట్టిన షాట్​కు గ్రౌండ్‌లో కుప్పకూలిన ఆసీస్ బౌలర్​, నాన్‌స్ట్రైకింగ్‌ ఎండ్‌లో ఉన్న సిరాజ్ పరిగెత్తుకు వెళ్లి..