AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వీడేం మనిషండి బాబోయ్.! మొసలిని అమాంతం కౌగిలించుకున్నాడు.. ఆ తర్వాత సీన్..!

'అడవి రాజు' సింహం కూడా భయపడే మొసలిని కౌగిలించుకుని హాయిగా పడుకున్నాడు ఓ వ్యక్తి. కాలిపోర్నియాలో మాత్రమే ఉండే అత్యంత ప్రమాదకర మొసలిని వాటుకుని పడుకున్న దృశ్యాలు కెమెరాకు చిక్కాయి. ఈ అద్భుతమైన వీడియో చూసిన వారందరూ ఆశ్చర్యపోతున్నారు. ఈ వీడియో తెగ వైరల్ అవుతోంది.

వీడేం మనిషండి బాబోయ్.! మొసలిని అమాంతం కౌగిలించుకున్నాడు.. ఆ తర్వాత సీన్..!
Man Hugs Crocodile
Balaraju Goud
|

Updated on: Apr 08, 2025 | 9:31 PM

Share

ఒళ్లు గగుర్పాటుకు గురిచేస్తున్న ఒక వీడియో ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది. నిజానికి, ఒక వ్యక్తి తనకంటే పెద్ద సైజు ఉన్న మొసలిని కౌగిలించుకున్నాడు. అది కనిపించే విధానం చూస్తే గుండె ఆగినంత పని అవుతోంది. ఈ వీడియో సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తోంది. ఈ క్లిప్ చూసిన వారందరూ షాక్ అవుతున్నారు.

వైరల్ అవుతున్న వీడియోలో ఒక వ్యక్తి ఒక పెద్ద మొసలితో నేలపై పడుకుని ఉన్నాడు. ఈ దృశ్యం నిజంగా ఆశ్చర్యకరంగా ఉంది. ఎందుకంటే, ఈ మనిషి హాయిగా మొసలిని కౌగిలించుకుని పడుతకున్నాడు. దీనికి ‘అడవి రాజు’ సింహం కూడా భయపడుతుంది. అలాంటిది ఏమాత్రం జంకు బొంకు లేకుండా ఆ మనిషి ముఖ కవళికలను చూస్తే, అతను మొసలికి అస్సలు భయపడకుండా పడుకున్నాడు.

వైరల్ వీడియో చూడండి..

ఈ అద్భుతమైన వీడియో @jayprehistoricpets అనే హ్యాండిల్‌తో Instagramలో షేర్ చేయడం జరిగింది. ఈ వీడియోలో కనిపిస్తున్న మొసలి డార్త్ గేటర్ అని, దానితో అతను కుస్తీ పడుతున్నాడని జే బ్రూవర్ అనే యూజర్ చెప్పాడు. “ఇది మీకు పిచ్చిగా అనిపించవచ్చు, కానీ నేను నా కలను గడుపుతున్నాను.” రెజ్లింగ్ రింగ్‌లోకి ప్రవేశించడం తన కల అని, డార్త్ గేటర్ లాంటి భాగస్వామి ఉండటం తన అదృష్టమని ఆ వ్యక్తి చెప్పాడు.

జే బ్రూవర్ అమెరికాలోని కాలిఫోర్నియాలో ఉన్న ‘ది రెప్టైల్ జూ’ స్థాపకుడు. అతను, అతని కుమార్తె జూలియట్ సోషల్ మీడియాలో బాగా ప్రాచుర్యం పొందారు. ఇన్‌స్టాగ్రామ్‌లో బ్రూవర్‌ను 8.5 మిలియన్ల మందికి పైగా ఫాలోవర్స్ ఉన్నారు. అతని ప్రొఫైల్ అద్భుతమైన రీల్స్ తో నిండి ఉంటుంది.

కాలిఫోర్నియాలో కనిపించే డార్త్ గేటర్ చాలా దూకుడుగా ఉండే జాతి. దానిని పెంపుడు జంతువుగా ఉంచుకోవడం చట్టవిరుద్ధం. ఏప్రిల్ 7న అప్‌లోడ్ చేసిన ఈ వీడియోను ఇప్పటివరకు 15 వేలకు పైగా లైక్ చేశారు. కామెంట్ సెక్షన్‌లో స్పందనల వరద వస్తోంది. ఒక వినియోగదారు ఇలా వ్యాఖ్యానించారు. “మీ ధైర్యాన్ని మేము అభినందించాలి.” మరొక వినియోగదారుడు, వాళ్ళకి దూరంగా ఉండు బ్రదర్ అని రాశారు. అతను దాన్ని ఎప్పుడు పట్టుకుంటాడో ఎవరికి తెలియదు. ఇది చాలా ప్రమాదకరమైన స్టంట్ అని మరొక వినియోగదారు అన్నారు. నువ్వు ఎప్పుడు దాని వేటగా మారుతావో నీకు తెలియదు. ఇది పూర్తిగా పిచ్చిది అని మరొక వినియోగదారు వ్యాఖ్యానించారు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..