కరోనాను జయించి.. మృత్యు ఒడిలోకి..

నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. ఎల్లారెడ్డి మండలంలోని కళ్యాణి గ్రామానికి చెందిన గుజ్జరి విజయ్‌కుమార్‌ (17) ఇంటర్‌ చదువుతున్నాడు. లాక్‌డౌన్‌ కారణంగా విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించడంతో

  • Tv9 Telugu
  • Publish Date - 12:13 am, Mon, 13 July 20
కరోనాను జయించి.. మృత్యు ఒడిలోకి..

Man died in accident: నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. ఎల్లారెడ్డి మండలంలోని కళ్యాణి గ్రామానికి చెందిన గుజ్జరి విజయ్‌కుమార్‌ (17) ఇంటర్‌ చదువుతున్నాడు. లాక్‌డౌన్‌ కారణంగా విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించడంతో అతడు హైదరాబాద్‌లో ఉండే మేన మామ వద్దకు వెళ్లాడు. అక్కడ మెస్‌లో వంట పనులు చేసే మేనమామతో పాటు విజయ్‌కూ కరోనా సోకింది.

ఈ క్రమంలో వీరిద్దరు గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందారు. రెండ్రోజుల క్రితం కరోనా నెగెటివ్‌ రావడంతో ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. శుక్రవారం రాత్రి మామ, అల్లుడు కలిసి మేనమామ స్వగ్రామమైన మెదక్‌ జిల్లా చిన్నశంకరంపేటకు బైక్‌పై బయల్దేరారు. అయితే, మనోహరాబాద్‌ శివారులో యూటర్న్‌ తీసుకుంటున్న వీరి బైక్‌ లారీని ఢీకొట్టింది. మేనమామ అక్కడికక్కడే మృతి చెందగా, గాయపడిన విజయ్‌ను ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. శనివారం కళ్యాణి గ్రామంలో అంత్యక్రియలు నిర్వహించారు.

Also Read: ఫలించిన చర్చలు.. స్వదేశానికి 367 మంది భారతీయులు..!