ఆ మూవీ తీస్తే.. తల్లిగా నటించేందుకు రెడీ అంటున్న బీజేపీ మహిళా నేత..

ప్రముఖ నటి.. బీజేపీ నాయకురాలు మాళవికా అవినాష్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దేశ రాజధానిలో ఏడేళ్ల క్రితం జరిగిన నిర్భయ హత్యాచార కేసులో దోషులకు ఉరిశిక్ష పడటంపై.. ఆమె స్పందించారు. ఈ కేసులో తన కూతురి ఆత్మకు శాంతి కలగాలని న్యాయం జరిగేవరకు పోరాడిన నిర్భయ తల్లి ఆశాదేవిపై ప్రశంసల వర్షం కురిపించింది. నేటి నేషనల్‌ లీడర్‌ ఆశాదేవి అని కొనియాడారు. శుక్రవారం బెంగళూరులో జరిగిన ఓ మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. నిర్భయ పేరుతో ఎవరైనా […]

  • Tv9 Telugu
  • Publish Date - 6:22 pm, Sat, 21 March 20
ఆ మూవీ తీస్తే.. తల్లిగా నటించేందుకు రెడీ అంటున్న బీజేపీ మహిళా నేత..

ప్రముఖ నటి.. బీజేపీ నాయకురాలు మాళవికా అవినాష్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దేశ రాజధానిలో ఏడేళ్ల క్రితం జరిగిన నిర్భయ హత్యాచార కేసులో దోషులకు ఉరిశిక్ష పడటంపై.. ఆమె స్పందించారు. ఈ కేసులో తన కూతురి ఆత్మకు శాంతి కలగాలని న్యాయం జరిగేవరకు పోరాడిన నిర్భయ తల్లి ఆశాదేవిపై ప్రశంసల వర్షం కురిపించింది. నేటి నేషనల్‌ లీడర్‌ ఆశాదేవి అని కొనియాడారు. శుక్రవారం బెంగళూరులో జరిగిన ఓ మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. నిర్భయ పేరుతో ఎవరైనా సినిమా తీస్తే.. అందులో తల్లి పాత్ర పోషించేందుకు తాను సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. ఈ క్రమంలో ఆశాదేవి గురించి ప్రస్తావించారు. ఒక తల్లిగా కూతురి ఆత్మశాంతి కోసం.. ఏడేళ్లపాటు కోర్టుల చుట్టూ తిరిగారని, అనుకున్నది సాధించడమంటే అదేనని అన్నారు. కన్న కూతురిపై రాక్షసత్వంగా దారుణానికి ఒడిగట్టిన దుర్మార్గులకు ఉరిశిక్ష పడేదాక న్యాయపోరాటం చేశారని.. దీంతో అందరికీ న్యాయ వ్యవస్థపై గౌరవం పెరిగిందని పేర్కొన్నారు.