Hari Hara Veera Mallu : పవర్ స్టార్ పవన్ కళ్యణ్ సినిమా కోసం ఆయన అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచుస్తున్నారు. వకీల్ సాబ్ సినిమాతో సాలిటీ రీ ఎంట్రీ ఇచ్చిన పవన్.. ఇప్పుడు అయ్యప్పనుం కోషియం రీమేక్‌ను సిద్ధం చేస్తున్నారు. ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుగుతోంది. ఈ సినిమాలో పవన్‌తో హీరో రానా కూడా నటిస్తున్నాడు. ఇక ఈ సినిమాతోపాటే క్రిష్ దర్శకత్వంలో హరిహర వీరమల్లు సినిమాను కూడా చేస్తున్నాడు పవన్. ఇటీవల విడుదల చేసిన మోషన్ పోస్టర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాను భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో పవన్ బందిపోటుగా కనిపించనున్నాడని తెలుస్తుంది. ఇప్పటికే ఈ సినిమా కోసం హైదరాబాద్ లో భారీ సెట్ లను కూడా రెడీ చేస్తున్నారు. ఈ సినిమాలో పవన్ సరసన నిధి అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తుంది. ఈ సినిమాలో వజ్రాల దొంగ పాత్రలో పవన్ నటిస్తున్నాడు. ఈ సినిమా నుంచి త్వరలో టీజర్ వచ్చే అవకాశాలు ఉన్నాయనే టాక్ కొన్ని రోజులుగా వినిపిస్తోంది. పవర్ స్టార్ పుట్టిన రోజు కానుకగా టీజర్ విడుదల అవుతుందని అంతా అనుకున్నారు.
కానీ పవన్ బర్త్ డే కు టీజర్ ను విడుదల చేయడంలేదని తెలుస్తోంది. సెప్టెంబర్ 2న పవన్ సినిమాకు సంబందించిన మేకింగ్ వీడియోను విడుదల చేయనున్నారట. పవన్ కల్యాణ్ కెరియర్లోనే భారీ బడ్జెట్‌తో నిర్మితమవుతున్న సినిమా ఇది. ఈ సినిమా కోసం కోట్ల రూపాయల ఖర్చుతో భారీ సెట్లు వేయించారు. వచ్చే వేసవిలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
మరిన్ని ఇక్కడ చదవండి :