AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మీ కిచెన్ సింక్ పసుపు రంగులోకి మారిందా? ఈ చిట్కాలతో నిమిషాల్లో కొత్తదానిలా మెరిపించేయండి!

వంటగదిలో సింక్ అత్యంత ముఖ్యమైన భాగం. వంటగదిలో మనం ఎక్కువగా వాడేది సింక్. గిన్నెలు కడగడం, కూరగాయలు శుభ్రం చేయడం వల్ల సింక్ పైన జిడ్డు, పాచి, నీటి మరకలు పేరుకుపోయి పసుపు రంగులోకి మారుతుంటుంది. సాధారణ సోప్‌తో కడిగినా ఈ మొండి మరకలు అంత త్వరగా పోవు. అటువంటప్పుడు ఈ ఇంటి చిట్కాలను ప్రయత్నించి చూడండి.

మీ కిచెన్ సింక్ పసుపు రంగులోకి మారిందా? ఈ చిట్కాలతో నిమిషాల్లో కొత్తదానిలా మెరిపించేయండి!
Kitchen Sink Cleaning Tips
Jyothi Gadda
|

Updated on: Apr 27, 2026 | 8:24 PM

Share

వంటగదిలో సింక్ అత్యంత ముఖ్యమైన భాగం. సింక్ మురికిగా మారే కొద్దీ, దానిని శుభ్రం చేయడం మరింత కష్టమవుతుంది. మీ సింక్ మురికిగా ఉంటే, దానిని త్వరగా శుభ్రం చేయడానికి మీరు ఈ చిట్కాను ఉపయోగించవచ్చు. మీ సింక్‌ను శుభ్రం చేసే సరైన పద్ధతిని తెలుసుకుందాం.

1. బేకింగ్ సోడా – వెనిగర్ మ్యాజిక్: ఇది క్లీనింగ్ ప్రపంచంలో ఒక శక్తివంతమైన మిశ్రమం. ముందుగా సింక్ మొత్తాన్ని తడిపి, దానిపై బేకింగ్ సోడా చల్లాలి. ఒక స్ప్రే బాటిల్‌లో వెనిగర్ తీసుకుని సోడా పైన చల్లండి. అప్పుడు వచ్చే బుడగలు (Chemical reaction) మరకలను విచ్ఛిన్నం చేస్తాయి. 15 నిమిషాల తర్వాత పాత టూత్ బ్రష్ లేదా స్పాంజ్‌తో రుద్ది కడిగేయండి. అంతే మీ సింక్‌ క్షణాల్లో కొత్తదానిలా మెరిసిపోతుంది.

2. నిమ్మరసం, ఉప్పు: నిమ్మకాయలోని సిట్రిక్ యాసిడ్ పసుపు మరకలను తొలగించడంలో గొప్పగా పనిచేస్తుంది. నిమ్మచెక్కపై కొంచెం ఉప్పు చల్లి, దానితో సింక్ అంచులను, మూలలను బాగా రుద్దాలి. ఇది మరకలను పోగొట్టడమే కాకుండా, సింక్ నుండి వచ్చే దుర్వాసనను కూడా నివారిస్తుంది.

ఇవి కూడా చదవండి

3. హైడ్రోజన్ పెరాక్సైడ్ (Hydrogen Peroxide): మరకలు మరీ మొండిగా ఉంటే, ఒక కాటన్ బట్టపై కొంచెం హైడ్రోజన్ పెరాక్సైడ్ వేసి మరకలపై అద్ది కొద్దిసేపు ఉంచండి. ఆ తర్వాత కడిగేస్తే తెల్లటి మెరుపు వస్తుంది.

4. టూత్‌పేస్ట్ చిట్కా: సింక్ మూలల్లో పేరుకుపోయిన మురికిని వదిలించడానికి కొంచెం టూత్‌పేస్ట్ వేసి బ్రష్‌తో రుద్దితే వెంటనే క్లీన్ అవుతుంది. సింక్ శుభ్రం చేసిన తర్వాత పొడి బట్టతో తుడవడం వల్ల నీటి చుక్కల మరకలు పడకుండా ఉంటాయి. ప్రతిరోజూ రాత్రి పడుకునే ముందు సింక్‌ను ఒక్కసారి సోప్ వాటర్‌తో కడిగితే పసుపు మరకలు ఏర్పడే అవకాశమే ఉండదు.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us