Make Rohit Indian Captain: ‘కోహ్లీ వద్దు.. రోహిత్ ముద్దు.. కెప్టెన్‌ తోపాటు హెడ్‌ కోచ్‌ను మార్చండి’: మీమ్స్‌ తో నెటిజన్ల ఫైర్

ఇంగ్లండ్ గడ్డపై జరిగిన డబ్ల్యూటీసీ ఫైనల్‌లో టీమిండియా ఘోర పరాజయం పాలైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇండియన్ క్రికెట్ ఫ్యాన్స్ కెప్టెన్‌ కోహ్లీపై చాలా కోపంతో ఉన్నారు.

Make Rohit Indian Captain: 'కోహ్లీ వద్దు.. రోహిత్ ముద్దు.. కెప్టెన్‌ తోపాటు హెడ్‌ కోచ్‌ను మార్చండి': మీమ్స్‌ తో నెటిజన్ల ఫైర్
Virat Kohli And Rohit Sharma
Follow us
Venkata Chari

|

Updated on: Jun 24, 2021 | 7:44 PM

Make Rohit Indian Captain: ఇంగ్లండ్ గడ్డపై జరిగిన డబ్ల్యూటీసీ ఫైనల్‌లో టీమిండియా ఘోర పరాజయం పాలైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇండియన్ క్రికెట్ ఫ్యాన్స్ కెప్టెన్ విరాట్ కోహ్లీపై చాలా కోపంతో ఉన్నారు. ఈమేరకు సోషల్ మీడియాలో కెప్టెన్‌ ను మార్చాలంటూ హడావుడి చేస్తున్నారు. #MakeRohitIndianCaptain, #Wewantnewcaptain అనే రెండు హ్యాష్ ట్యాగ్‌లను ట్రెండింగ్ చేస్తున్నారు. భారత్‌పై కివీస్ 8 వికెట్ల తేడాతో గెలిచి తొలి ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ ట్రోఫీని సాధించింది. ఓవైపు మాజీ క్రికెటర్లు కూడా కెప్టెన్సీ మార్పు అంశాన్ని తెరపైకి తెస్తున్నారు. మరోవైపు టీమిండియా చెత్త ప్రదర్శనకు కోహ్లీ నే కారణమంటూ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విరాట్ కోహ్లీను కెప్టెన్సీ నుంచి తప్పించి రోహిత్ శర్మకు సారథ్యం అప్పగించాలంటూ డిమాండ్ చేస్తున్నారు. ఈమేరకు తుది జట్టును కూడా ఎంపిక చేసుకోలేని కోహ్లీ, గ్రౌండ్‌లోనూ సరైన ఫలితాలు రాబట్టడంలో విఫలమయ్యాడని ఆరోపణలు గుప్పిస్తున్నారు. పైగా సరైన మైండ్ సెట్‌ గల ప్లేయర్లు కావాలంటూ మాట్లాడడం ఎంత వరకు సబబు అని విమర్శలు చేస్తున్నారు.

టీమిండియా హెచ్‌కోచ్‌ కి ఇందులో భాగస్వామ్యం ఉందని, ఆయన్ను కూడా తొలగించాలని అభిమానులు కోరుతున్నారు. ఆయన స్థానంలో ఎంతో నిబద్ధత చూపే రాహుల్ ద్రవిడ్‌ ను ఎంచుకోవాలని సూచిస్తున్నారు. కోహ్లీ ఓ అన్‌ లక్కీ కెప్టెన్ అని కామెంట్లు చేస్తున్నారు. టాస్ కూడా అతనికి కలిసి రాదని, ముఖ్యంగా ఐసీసీ ఈవెంట్లలో కెప్టెన్‌గా కోహ్లీ ఘోరంగా విఫలమవుతున్నాడని విమర్శిస్తున్నారు. కోహ్లీని మార్చడం ఇప్పటికే బాగా లేట్ అయిందని, ఇంకా అలాగే ఉంచితే త్వరలో జరగబోయే టీ20 ప్రపంచ కప్‌ను కూడా భారత్ కోల్పోవాల్సి వస్తుందని అభిప్రాయపడుతున్నారు. హిట్ మ్యాన్‌ ను కెప్టెన్ చేస్తేనే టీ20 వరల్డ్ కప్‌ మన సొంతమవుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

Also Read:

Tokyo Olympics: ‘ఎంజాయ్ చేయాలంటే కుదరదు.. గమ్మున ఉండాల్సిందే’: జపాన్ ప్రభుత్వం!

Viral Photo: ‘ఫొటో ఆఫ్ ది డే’ అంటూ అభిమానుల కామెంట్లు.. కోహ్లీ భుజంపై వాలిన కివీస్ కెప్టెన్! వైరలవుతోన్న ఫొటో

Indian Cricket Team: ఫైనల్స్‌లో తడబడుతోన్న టీమిండియా; ఏడేళ్లలో 6 ఐసీసీ ట్రోఫీలు మిస్!