Mahindra Cargo Services: మహీంద్రా కార్గో సేవలు షురూ.. ఏ ఏ నగరాల్లో ప్రారంభిస్తున్నారో తెలుసా..
Mahindra Cargo Services: ప్రముఖ ఇంటిగ్రేటెడ్ థర్డ్ పార్టీ లాజిస్టిక్స్ సంస్థ మహీంద్రా లాజిస్టిక్స్ లిమిటెడ్ (ఎంఎల్ఎల్) కొత్తగా కార్గో సేవలను ప్రారంభించింది. ఈడెల్’బ్రాండ్
Mahindra Cargo Services: ప్రముఖ ఇంటిగ్రేటెడ్ థర్డ్ పార్టీ లాజిస్టిక్స్ సంస్థ మహీంద్రా లాజిస్టిక్స్ లిమిటెడ్ (ఎంఎల్ఎల్) కొత్తగా కార్గో సేవలను ప్రారంభించింది. ఈడెల్’బ్రాండ్ పేరుతో ఈ సేవలను ఆరంభించినట్లు సంస్థ పేర్కొంది. తొలిదశలో మొదట బెంగళూరులో ఈడెల్ సేవలు ఉంటాయి. ఆతరువాత భారతదేశంలోని 6 ప్రధాన నగరాలైన బెంగళూరు, న్యూఢిల్లీ, ముంబై, పూణే, హైదరాబాద్ మరియు కోల్‌కతాలో ప్రారంభిస్తారు. తదుపరి రాబోయే 12 నెలల్లో మొత్తం 14 నగరాలకు విస్తరించనుంది.
పర్యావరణ పరిరక్షణ కోసం ప్రయోగాత్మకంగా త్రీవీలర్ ఎలక్ట్రిక్ వాహనాలతో కార్గో సేవలను అందించనుంది. ఇందుకోసం EDel పేరుతో ఎలక్ట్రిక్ కార్గో వాహనాలను తెస్తోంది. ప్యాకేజీ & ట్రిప్-ఆధారిత సేవలతో సహా బహుళ సేవలను అందిస్తుంది. ప్రస్తుత ఈ ఎలక్ట్రిక్ కార్గో వాహనాల్లో లోడ్ సామర్థ్యం మరియు మెరుగైన శ్రేణితో, ఈడెల్ ఇ-కామర్స్, ఎఫ్‌ఎంసిజి, ఫార్మాస్యూటికల్, కన్స్యూమర్ డ్యూరబుల్స్ మరియు ఎలక్ట్రానిక్స్ పరిశ్రమలలోని వినియోగదారులకు సమర్థవంతమైన బాధ్యతాయుతమైన అందించే లక్ష్యంతో ముందుకు సాగుతోంది. ఈ విషయమై మహీంద్రా లాజిస్టిక్స్ లిమిటెడ్ ఎండి, సీఈవో రాంప్రవీణ్ స్వామినాథన్ మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా ఉన్న వినియోగదారులకు లాజిస్టిక్స్ సేవలను ఎలక్ట్రిక్ వాహనాల ద్వారా అందిస్తామని తెలిపారు. భారతదేశం అంతటా మా సేవలకు డిమాండ్ పెరుగుతూనే ఉంది. తొలిదశలో EDel 1,000 వాహనాలను సమకూర్చుకుంది. ఇవి EDelఎలక్ట్రిక్ త్రీవీలర్లను వినియోగించకుటోంది.
తెలంగాణ ఆర్టీసీ కార్గో సేవల్లో కీలక ముందడుగు..హైదరాబాద్‌లో హోమ్ డెలివరీ సేవలు ప్రారంభం