Traffic Jam at Toll Gates: టోల్‌ గేట్ల వద్ద మొదలైన సంక్రాంతి రద్దీ.. హైదరాబాద్‌ నుంచి ఆంధ్రకు క్యూ కట్టిన..

Traffic Jam at Toll Gates:సంక్రాంతి పండుగ సందర్భంగా నగరవాసులు హైదరాబాద్‌ నుంచి ఆంధ్రకు క్యూ కట్టారు. తెలుగు ప్రజలు సొంతూళ్లకు వెళుతుండటంతో విజయవాడ

Traffic Jam at Toll Gates: టోల్‌ గేట్ల వద్ద మొదలైన సంక్రాంతి రద్దీ.. హైదరాబాద్‌ నుంచి ఆంధ్రకు క్యూ కట్టిన..
Follow us
uppula Raju

|

Updated on: Jan 09, 2021 | 7:14 PM

Traffic Jam at Toll Gates:సంక్రాంతి పండుగ సందర్భంగా నగరవాసులు హైదరాబాద్‌ నుంచి ఆంధ్రకు క్యూ కట్టారు. తెలుగు ప్రజలు సొంతూళ్లకు వెళుతుండటంతో విజయవాడ 65న నెంబర్ జాతీయ రహాదారిపై టోల్‌ ప్లాజాల దగ్గర రద్దీ విపరీతంగా పెరిగింది. కృష్ణా జిల్లా కంచిక చర్ల మండలం కీసర్ టోల్‌ గేట్ దగ్గర వాహనాలు బారులు తీరాయి. మరోవైపు వారం రోజుల పాటు టోల్‌ గేట్లు ఎత్తి వేయాలని వాహనదారుల డిమాండ్‌ చేస్తున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌ మండలం పంతంగిలోను అదే తీరు కొనసాగుతోంది. నల్గొండ జిల్లా కొర్లపాడు టోల్‌గేట్‌ దగ్గర వాహనాల తిప్పలు తప్పడం లేదు.

ప్రతీ ఏటా తప్పని చిక్కులు పండగ సమయంలో ఈ విధంగానే జరుగుతుంది. కొన్నిచోట్ల టోల్‌ గేట్ సిబ్బందితో వాహనదారుల గొడవ పడుతున్నారు. టోల్‌ గేట్‌ దగ్గర గత సంవత్సరం నుంచి ఫాస్ట్ టాగ్‌ ఏర్పాటు చేశారు. ప్రత్యేకంగా ఫాస్ట్ టాగ్ కౌంటర్లను రెడీ చేశారు. అయినా గంటల కొద్దీ నిరీక్షణ తప్పడం లేదు. ఫాస్ట్ టాగ్‌పై అవగాహన లేక వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. పలు బూత్‌లలో కొన్ని ఫాస్ట్‌ ట్యాగ్‌ స్కానర్లు పనిచేయడం లేదు. గత ఏడాది పండగ సందర్భంగా టోల్‌ ఇరు రాష్ట్రాలు ఛార్జీలు లేవని ప్రకటించాయి. అయినా టోల్‌ ప్లాజాల నిర్వాహకులు చార్జీలు వసూలు చేశారు. పరిస్థితులు మితిమీరటంతో పోలీసులు జోక్యం చేసుకున్న సంగతి తెలిసిందే.

ఇదిలా ఉండగా ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడుపుతోంది. సంక్రాంతి పండుగ సందర్భంగా టీఎస్ ఆర్టీసీ 4,980 స్పెషల్‌ బస్సులు నడిపేందుకు ఏర్పాట్లు చేసింది. తెలంగాణ ప్రాంతానికి 3,380 బస్సులు ఆంధ్రప్రదేశ్‌కు 1,600 స్పెషల్‌ బస్సులు నడుపుతోంది. ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ, విజయనగరం, తెనాలి, గుంటూర్‌, విశాఖపట్నం, తిరుపతి ,అనంతపురం, కడప, చిత్తూరు, ఒంగోలు, నెల్లూరు, ,ఉదయగిరి, శ్రీకాకుళం, భీమవరం, నర్సాపురం, కనిగిరి, కందుకూరు, పామూరు, పొదిలి, రాజమండ్రి, కాకినాడ, రాజోలు, తెనాలి, మచిలీపట్నం, ఏలూరు, తాడేపల్లిగూడెం, తణుకు, కర్నూలు, గుంటూరు, గుడివాడ, పోలవరం పట్టణాలకు ప్రత్యేక బస్సులు నడుపుతోంది. పండుగకు ఊరెళ్లేవారు ఎంజీబీఎస్‌కు రాకుండా నగర శివారు ప్రాంతాల నుంచి టీఎస్‌ఆర్టీసీ సేవలు అందిస్తోంది.జూబ్లీ బస్‌స్టేషన్‌, ఎంజీబీఎస్ ,ఈసీఐఎల్‌, కేపీహెచ్‌బీ, లింగంపల్లి, చందానగర్‌, ఎస్‌ఆర్‌నగర్‌, ఉప్పల్‌ క్రాస్‌ రోడ్‌, ఎల్‌బీ నగర్‌, అమీర్‌పేట, బీఎస్ఎన్ఎల్ ఆఫీసు, దిల్‌సుఖ్‌ నగర్‌ ప్రాంతాల నుంచి వివిధ ప్రాంతాలకు ప్రత్యేక బస్సు సర్వీసులు నడుపుతోంది.

జూబ్లీ బస్‌స్టేషన్‌ నుంచి కరీంనగర్‌, నిజామాబాద్‌, ఆదిలాబాద్‌, మెదక్‌ జిల్లాలకు షెడ్యుల్‌ బస్సులతోపాటు స్పెషల్‌ బస్సులు సీబీఎస్‌ నుంచి కర్నూల్‌, అనంతపురం, కడప, చిత్తూరు, ఒంగోలు, మాచర్ల, నెల్లూరు‌ వైపు వెళ్లే షెడ్యూలు‌ బస్సులతోపాటు స్పెషల్‌ బస్సులు ఉప్పల్‌ ఎక్స్‌ రోడ్‌ నుంచి యాదగిరిగుట్ట, వరంగల్‌ వైపు వెళ్లే షెడ్యూల్‌ బస్సులతోపాటు స్పెషల్‌ బస్సులు మిర్యాలగూడ, నల్లగొండ, కోదాడతోపాటు సూర్యాపేట వైపు వెళ్లే షెడ్యూల్‌ బస్సులతోపాటు స్పెషల్స్ ఏర్పాటు చేసింది. ఆన్‌లైన్‌ ద్వారా ఆర్టీసీ టికెట్‌ బుక్‌ చేసుకునే సౌకర్యం కల్పించింది.

ఏపీలో సంక్రాంతికి ఏపీఎస్ఆర్టీసీ 3607 ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసింది. హైదరాబాద్‌తో పాటుగా తెలంగాణలోని ఇతర ప్రాంతాలకు 1,251 బస్సులు బెంగళూరు నుంచి ఏపీకి 433 బస్సులు, చెన్నై నుంచి ఏపీకి 133 బస్సులు, ఏపీలోని ఇతర జిల్లాల నుంచి విజయవాడకు 201 బస్సులు, ఏపీలోని ఇతర జిల్లా నుంచి విశాఖపట్నంకు 551 బస్సులు, ఏపీలో పలు జిల్లాల మధ్య 1,038 ప్రత్యేక బస్సులు నడుపుతోంది. సంక్రాంతికి స్పెషల్ ఫ్లైట్స్ కూడా ఏర్పాటు చేశారు. గంటలో విజయవాడ ఆంధ్రాకు స్పెషల్ విమానాలు నడిపేందుకు ఇండియన్ ఎయిర్ వేస్ రెడీ అయింది. స్పైస్ జెట్ విమాన సర్వీసుల వివరాలు ఈ విధంగా ఉన్నాయి. జనవరి 10 నుంచి ప్రతి రోజు సాయంత్రం 4.30కు హైదరాబాద్‌లో బయలుదేరి ప్లైట్ సాయంత్రం 5.30గంటలకు విజయవాడకు చేరుతోంది. సాయింత్రం 6గంటలకు విజయవాడలో బయల్దేరి, రాత్రి 7.10కి హైదరాబాద్ చేరుతోంది. జనవరి 16 నుంచి మరో సర్వీసు విజయవాడలో ప్రారంభం కానుంది. ప్రతి రోజు మధ్యాహ్నం 3.20కు బయల్దేరి 3.55కు హైదరాబాద్‌కు చేరుతోంది. ఈ విమానం జనవరి 30వ తేదీ వరకే పరిమితం కానుంది. జనవరి 11 నుంచి 28వ తేదీ వరకు మరో కొత్త సర్వీసు ప్రారంభమవుతుంది. ఈ విమానం విజయవాడలో మధ్యాహ్నం 3.20కు బయల్దేరి హైదరాబాద్‌కు 4.10కి చేరుతోంది.

టోల్‌గేట్ల వద్ద వెహికల్స్ ఆగాల్సిన అవసరం లేదట.. రెండేళ్లలో టోల్‌ఫ్రీ దేశంగా మారుతుందన్న గడ్కరీ