ఏంటి కీర్తి ఇది..నొచ్చకుంటున్న మహేశ్ ఫ్యాన్స్ !
'మహానటి' సినిమాతో కీర్తి సురేష్ ఫేమ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. ఆమె నటన స్థాయి ఏంటో ప్రపంచానికి తెలిసింది. ఈ సినిమాలో కీర్తి నటనకు విమర్శకుల నుంచి కూడా ప్రశంసలు వచ్చాయి

‘మహానటి’ సినిమాతో కీర్తి సురేష్ ఫేమ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. ఆమె నటన స్థాయి ఏంటో ప్రపంచానికి తెలిసింది. ఈ సినిమాలో కీర్తి నటనకు విమర్శకుల నుంచి కూడా ప్రశంసలు వచ్చాయి. ఆమెను తెలుగు ప్రేక్షకులు ఓన్ చేసుకున్నారు. అయితే వరసగా రెండు డిజాస్టర్లు ఇచ్చి అభిమానులను నిరాశపరిచింది ఈ మద్దుగుమ్మ. ‘పెంగ్విన్’ ప్లాప్ నుంచి తేరుకోకముందే… ‘మిస్ ఇండియా’ చిత్రానికి కూడా నెగిటివ్ రివ్యూలు మొదలయ్యాయి. సినిమాలో కీర్తి సురేష్ లుక్స్ గురించి కూడా ఆడియెన్స్ పెదవి విరుస్తున్నారు. ‘మిస్ ఇండియా’ కోసం కీర్తి పూర్తిగా చిక్కిపోయిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మహేశ్ ఫ్యాన్స్ నొచ్చుకుంటున్నారు. ‘సర్కారు వారి పాట’లో కీర్తి సురేష్ ప్రస్తుత లుక్‌లో మహేశ్ పక్కన సెట్ అవుతుందా అని ఆరాలు తీస్తున్నారు. జీరో సైజ్‍కి మారిపోవడంతో కీర్తి ముఖంలో కళ తప్పిపోయినట్లు స్పష్టంగా తెలుస్తోంది.
ఇక కీర్తి తదుపరి సినిమాలు ‘గుడ్‍లక్ సఖి’, ‘రంగ్ దే’ కూడా ఓటిటి ద్వారా విడుదల అవుతాయని ప్రచారం జరుగుతోంది. వాటి ఫలితాలు కూడా తేడా కొడితే కీర్తి ఇమేజ్ డౌన్ అయ్యే ప్రమాదం ఉంది. అయినా పర్లేదు… ఆమె కాస్త బరువు పెరిగి పాత లుక్‍లోకి వస్తే బాగుంటుందని సూపర్‍స్టార్ అభిమానులతో, కీర్తి అభిమానుల కూడా కోరుకుంటున్నారు. చూద్దాం..కీర్తి ఇదే లుక్ కొనసాగిస్తుందో, లేక పాత లుక్‌కి ఛేంజ్ అవుతుందో.
Also Read :




