2.5 కోట్లు పలికిన మహాత్ముడి కళ్లజోడు

మహాత్మాగాంధీ వాడిని ఏ వస్తువు అంతర్జాతీయంగా వేలం వేసిన మంచి ధర పలుకుతోంది. గతంలోక్విట్ ఇండియా ఉద్యమ కాలంలో జాతిపిత మహాత్మాగాంధీ వినియోగించిన చరఖా ఒకటి 2013లో వేలంపాటలో రూ. కోటి ధర..

2.5 కోట్లు పలికిన మహాత్ముడి  కళ్లజోడు
Follow us

| Edited By: Team Veegam

Updated on: Sep 15, 2020 | 7:01 PM

మహాత్మాగాంధీ వాడిని ఏ వస్తువు అంతర్జాతీయంగా వేలం వేసిన మంచి ధర పలుకుతోంది. గతంలోక్విట్ ఇండియా ఉద్యమ కాలంలో జాతిపిత మహాత్మాగాంధీ వినియోగించిన చరఖా ఒకటి 2013లో వేలంపాటలో రూ. కోటి ధర పలికింది. లండన్‌లో నిర్వహించిన ఈ వేలంపాట అప్పట్లో సంచలనంగా మారింది. ఎనిమిది దశాబ్దాల క్రితం ఉద్యమకాలంలో పుణెలోని ఎరవాడ జైలులో శిక్ష అనుభవిస్తున్న సమయంలో గాంధీ ఈ చరఖాను ఉపయోగించారని ముల్లక్ వేలం సంస్థ అధికారి మైఖేల్ మోరిస్ తెలిపారు.

అయితే  ఈ అలాంటి కొత్త రికార్డు సొంతం చేసుకుంది మహాత్ముడి కళ్లజోడు. ఇంగ్లండ్‌లోని ఈస్ట్ బ్రిస్టోల్ ఆక్షన్స్ సంస్థ ఈ కళ్లజోడును వేలం వేసింది. ఈ సంస్థ లెటర్ బాక్సుకు వేలాడుతూ ఈ కళ్లజోడు కనిపించిందట. వేలంలో కనీసం 15వేల యూరోలు అంటే రూ.15లక్షలు పలుకుతుందని నిర్వాహకులు భావించారట.

అనూహ్యంగా ఇది 2.6లక్షల యూరోలు అంటే సుమారు రూ.2.5కోట్లు పలికింది. గతంలో సౌతాఫ్రికాలో పనిచేసిన ఓ వ్యక్తి వీటిని సేకరించాడు. వంశపారంపర్యంగా తనకు వచ్చిన ఈ కళ్లజోడును ఇంగ్లండ్‌కు చెందిన వ్యక్తి బ్రిస్టోల్ ఆక్షన్స్‌కు పంపించాడు. అతడు పంపిన గాంధీజీ  కళ్లజోడు ఇప్పుడు భారీ వేళానికి అమ్ముడు పోయింది.

View this post on Instagram

SOLD £260,000 – Gandhi’s Glasses. An incredible result!

A post shared by East Bristol Auctions (@eastbristolauctions) on