దేశంలో 10 లక్షలకు పైగా కోవిడ్ టెస్టులు, కేంద్రం
దేశంలో గత 24 గంటల్లో 10 లక్షలకు పైగా కోవిడ్ టెస్టులు జరిగాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది. కరోనా వైరస్ పై పోరులో మనం ఈ మైలురాయిని దాటగలిగామని వెల్లడించింది. నిన్న 10 లక్షల 23 వేలకు..

దేశంలో గత 24 గంటల్లో 10 లక్షలకు పైగా కోవిడ్ టెస్టులు జరిగాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది. కరోనా వైరస్ పై పోరులో మనం ఈ మైలురాయిని దాటగలిగామని వెల్లడించింది. నిన్న 10 లక్షల 23 వేలకు పైగా వీటిని నిర్వహించినట్టు పేర్కొంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 1511 ల్యాబ్ లు ఉన్నాయని, ఇదే సమయంలో 63 వేల 613 మంది రోగులు కోలుకున్నారని అధికారులు స్పష్టం చేశారు. శనివారం నాటికి మృతుల సంఖ్య 55,794 కి చేరినట్టు వారు పేర్కొన్నారు.
గత మూడు వారాలుగా కోవిడ్ టెస్టులను ముమ్మరం చేసినట్టు ఈ మంత్రిత్వ శాఖ వెల్లడించింది.



