మహిళలు,చిన్నారులపై జరిగే అకృత్యాలను అరికట్టేందుకు ‘శక్తి’ చట్టాన్ని ప్రవేశ పెట్టిన మహారాష్ట్ర
మహిళలు చిన్నారులపై జరుగుతున్న అకృత్యాలను అరికట్టేందుకు ఏపీ ప్రభుత్వం దిశా చట్టాన్ని ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. దిశా చట్టం మాదిరిగానే ఇప్పుడు మహారాష్ట్రలో ‘శక్తి’ పేరిట కొత్త చట్టాన్ని తీసుకురానుంది అక్కడి ప్రభుత్వం.

మహిళలు చిన్నారులపై జరుగుతున్న అకృత్యాలను అరికట్టేందుకు ఏపీ ప్రభుత్వం దిశా చట్టాన్ని ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. దిశా చట్టం మాదిరిగానే ఇప్పుడు మహారాష్ట్రలో ‘శక్తి’ పేరిట కొత్త చట్టాన్ని తీసుకురానుంది అక్కడి ప్రభుత్వం. ఈ బిల్లును మహారాష్ట్ర ప్రభుత్వం సోమవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. చిన్నారులపై అత్యాచారం, యాసిడ్ దాడుల కేసుల్లో దోషులకు మరణదండన విధించేలా చట్టాల్లో మార్పులను ప్రతిపాదించింది. ఈ తరహా కేసుల విచారణను మరింత వేగంగా పూర్తి చేసేందుకు కొత్త తరహా వ్యవస్థనూ ప్రతిపాదించింది. లైంగికదాడి, యాసిడ్ దాడి, పిల్లలు, మహిళలపై సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు పెట్టడం వంటి నేరాలకు మరణ శిక్ష, రూ.10 లక్షల వరకు జరిమానా సహా పలు శిక్షలు విధించే అవకాశం ఉంది.




