మహారాష్ట్రలో సిగరెట్లు, బీడీల అమ్మకాలపై అంక్షలు
మహారాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వం సంచలన తీసుకుంది. విడిగా అమ్మే సిగరెట్లు, బీడీల అమ్మకాన్ని నిషేధించింది. ప్రజారోగ్య నేపథ్యంలో కీలక నిర్ణయం తీసుకున్నట్లు ఓ ప్రకటనలో తెలిపింది.
మహారాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వం సంచలన తీసుకుంది. విడిగా అమ్మే సిగరెట్లు, బీడీల అమ్మకాన్ని నిషేధించింది. ప్రజారోగ్య నేపథ్యంలో కీలక నిర్ణయం తీసుకున్నట్లు ఓ ప్రకటనలో తెలిపింది. ధూమపానం నిషేధంలో భాగంగా ప్రజా ప్రయోజనాల కోసం నోటిఫికేషన్ విడుదల చేసినట్లు అధికారులు పేర్కొన్నారు. ప్రభుత్వం కొత్త నిబంధనలతో వినియోగదారులు ఇకపై ప్పుసిగరెట్, బీడీల మొత్తం ప్యాకెట్ కొనవలసి ఉంటుంది. సింగిల్ స్టిక్ వదులుగా ఉన్న సిగరెట్లు, బీడీలు దానిపై నిర్దిష్ట ఆరోగ్య హెచ్చరికను కలిగి ఉండవు. అయితే ప్రభుత్వ నిర్ణయాన్ని అమ్మకందారులు వ్యతిరేకిస్తున్నారు. ప్రతిఒక్కరు మొత్తం ప్యాకెట్ కొనుగోలు చేయలేరని, తమ అమ్మకాలు తగ్గుతాయని దుకాణదారుడు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే, సర్కార్ ఎన్ని నిబంధనలు తీసుకువచ్చిన సిగరెట్, బీడీలకు అలవాటు పడినవారు ఏదో విధంగా తాగేస్తారని నిపుణులు అంటున్నారు.