‘కోవిషీల్డ్’ ట్రేడ్ మార్క్ మాదే ! సీరం సంస్థపై నాందేడ్ కంపెనీ కేసు, వ్యాక్సిన్ కి వాడరాదని అభ్యర్ధన
కరోనా వైరస్ వ్యాక్సిన్ కోవిషీల్డ్ ను ఉత్పత్తి చేస్తున్న పూణే లోని సీరం కంపెనీ కొత్త ట్రబుల్ లో పడింది. ఈ ట్రేడ్ మార్క్ పై మహారాష్ట్ర నాందేడ్ లోని క్యుటిస్ బయోటెక్ సంస్థ కేసు పెట్టింది.
కరోనా వైరస్ వ్యాక్సిన్ కోవిషీల్డ్ ను ఉత్పత్తి చేస్తున్న పూణే లోని సీరం కంపెనీ కొత్త ట్రబుల్ లో పడింది. ఈ ట్రేడ్ మార్క్ పై మహారాష్ట్ర నాందేడ్ లోని క్యుటిస్ బయోటెక్ సంస్థ కేసు పెట్టింది. తాము ఉత్పత్తి చేస్తున్న యాంటీ సెప్టిక్, శానిటైజర్, డిస్ ఇన్ ఫిఖ్టెంట్ లిక్విడ్, స్ప్రే, ఫ్రూట్, వెజిటబుల్ వాషింగ్ లిక్విడ్ వంటివాటికి కోవిషీల్డ్ ట్రేడ్ మార్క్ ను వాడుతున్నామని ఈ సంస్థ తెలిపింది. సీరం కంపెనీపై తమ లాయర్ ఆదిత్య సోనీ ద్వారా కోర్టులో దావా వేసింది. ఈ ట్రేడ్ మార్క్ రిజిస్ట్రేషన్ కోసం మేము గత ఏడాది ఏప్రిల్ 29 న దరఖాస్తు పెట్టుకున్నామని, అది పెండింగులో ఉందని, గత సంవత్సరం మే 30 నుంచి ఈ ట్రేడ్ మార్కును మేము వినియోగించుకుంటున్నామని వివరించింది. సీరం సంస్థ తన వ్యాక్సిన్ కి ఈ ట్రేడ్ మార్క్ వాడకుండా ఇంజంక్షన్ ఇవ్వాలని క్యుటిస్ బయోటెక్ విజ్ఞప్తి చేసింది.
దీనిపై కోర్టు సీరం కంపెనీకి నోటీసు జారీ చేస్తూ జనవరి 19 న దీనిపై విచారణ జరగాలని ఉత్తర్వులిచ్చింది. వ్యాక్సిన్ లాంచింగ్ ని ఆపాలని తాము కోరడంలేదని, కోవై షీల్డ్ ట్రేడ్ మార్క్ ని వినియోగించుకోకుండా చూడాలనే కోరుతున్నామని క్యూటీస్ కంపెనీ స్పష్టం చేసింది,
అటు- ఇండియాలో -తమ కోవిషీల్డ్ బ్రాండ్ కి వెంటనే అనుమతినివ్వాలని సీరం సంస్థ… డీ సీజీఐకి గత డిసెంబరు 7 న దరఖాస్తు పెట్టుకుందని తమకు తెలియవచ్చిందని క్యూటీస్ తరఫు లాయర్ సోనీ వెల్లడించారు.
Also Read :సీరం వారి కోవిషీల్డ్ టీకాతో సైడ్ ఎఫెక్ట్స్.. ఆరోపించిన వాలంటీర్.. రూ.5 కోట్లు పరిహారం కోరుతూ లీగల్ నోటీసు..! Also Read :కోవిషీల్డ్ వ్యాక్సిన్.. కేంద్రం అనుమతిస్తే.. ఒక్కో డోస్ రూ. 1000: సీరం సంస్థ చీఫ్