హీరో విశాల్‌కు షాక్.. నష్టాన్ని భరించాల్సిందే.!

హీరో విశాల్‌కు మద్రాస్ హైకోర్టు షాకిచ్చింది. 'యాక్షన్' సినిమా నష్టాలన్నీ విశాలే భరించాలని తీర్పు ఇచ్చింది. ఈ క్రమంలో వెంటనే రూ. 8.29 కోట్లను నిర్మాతలకు చెల్లించాలని ఆదేశించింది.

  • Ravi Kiran
  • Publish Date - 11:33 pm, Fri, 9 October 20
హీరో విశాల్‌కు షాక్.. నష్టాన్ని భరించాల్సిందే.!

Madras High Court Orders: హీరో విశాల్‌కు మద్రాస్ హైకోర్టు షాకిచ్చింది. ‘యాక్షన్’ సినిమా నష్టాలన్నీ విశాలే భరించాలని తీర్పు ఇచ్చింది. ఈ క్రమంలో వెంటనే రూ. 8.29 కోట్లను నిర్మాతలకు చెల్లించాలని ఆదేశించింది. వాస్తవానికి ‘యాక్షన్’ సినిమాను తక్కువ బడ్జెట్‌తో నిర్మించాలని మొదటిగా నిర్మాతలు భావించారు. అయితే ఆ చిత్రం కనీసం రూ. 20 కోట్లు కలెక్ట్ చేయకపోతే నష్టాలను తానే భరిస్తానని విశాల్ వారికి భరోసా ఇవ్వడంతో చివరికి రూ. 44 కోట్లతో నిర్మించారు.

కాగా, ‘యాక్షన్’ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఘోరంగా బోల్తాపడింది. దీనితో నష్టాన్ని పూడ్చే క్రమంలో తన తదుపరి చిత్రం ‘చక్ర’ను ట్రైడెంట్ బ్యానర్‌పై నిర్మిస్తానని విశాల్ నిర్మాతలకు మాటిచ్చాడు. అయితే ఆ మాటను పక్కన పెట్టి ‘చక్ర’ సినిమాను విశాల్ తన నిర్మాణ సంస్థపై తెరకెక్కించాడు. దీనితో ఆ సినిమా ఓటీటీ విడుదలను నిలిపివేయడమే కాకుండా.. తమకు న్యాయం చేయాలంటూ నిర్మాతలు మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు నిర్మాతలకు విశాలే డబ్బులు చెల్లించాలని చెప్పడమే కాకుండా.. ‘చక్ర’ సినిమాను ఓటీటీలో విడుదల చేసుకునేందుకు అనుమతి కూడా ఇచ్చింది.

Also Read: 

ఇంజినీరింగ్ విద్యార్ధులకు జగన్ సర్కార్ గుడ్ న్యూస్..

నిరుపేద కుటుంబాలకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్..

ప్రభుత్వ ఉద్యోగులకు జగన్ సర్కార్ గుడ్ న్యూస్..

తెలుగు రాష్ట్రాల మీదుగా నడిచే కొత్త రైళ్లు ఇవే..!

Bigg Boss 4: ఈ వారం ఎలిమినేట్ అయ్యేది ఆమె.? లేక అతడు.?