Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: నీటిలో మొసలికి చిక్కి కూడా ప్రాణాలతో బయటపడ్డ అడవి బర్రె.. షాకింగ్ వీడియో

సోషల్ మీడియాలో నిత్యం అనేక వీడియోలు వైరల్ అవుతుంటాయి. అందులో ముఖ్యంగా జంతువుల వీడియోలు అయితే కుప్పలు తెప్పులగా దర్శనమిస్తాయి.

Viral Video: నీటిలో మొసలికి చిక్కి కూడా ప్రాణాలతో బయటపడ్డ అడవి బర్రె.. షాకింగ్ వీడియో
Wildebeest Vs Crocodile
Follow us
Ram Naramaneni

|

Updated on: Nov 22, 2021 | 8:42 PM

సోషల్ మీడియాలో నిత్యం అనేక వీడియోలు వైరల్ అవుతుంటాయి. అందులో ముఖ్యంగా జంతువుల వీడియోలు అయితే కుప్పలు తెప్పులగా దర్శనమిస్తాయి. ముఖ్యంగా జంగిల్‌లో వైల్డ్ యానిమల్స్ జీవించాలంటే మరో జంతువును వేటాడక తప్పని పరిస్థితి. ఈ క్రమంలో ఆకలి తీర్చుకోవడానికి జంతువులు వేటాడే సన్నివేశాలు, ప్రాణాలు కాపాడుకోడానికి బలహీన జీవులు పడే బాధలకు సంబంధించిన దృశ్యాలు.. చాలా షాకింగ్‌గా ఉంటాయి. తాజాగా  ఓ వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. ఈ వీడియోలో అడవి బర్రెలు కొలను దాటుతున్నాయి. అన్నీ సేఫ్‌గానే ఒడ్డుకు చేరినా.. ఒకటి మాత్రం మొసలికి  చిక్కింది. మొసలి నీటిలో ఉంటే.. ఎంత బలంగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సింహాలు, పులులు.. సైతం నీటిలో ఉన్న మొసలికి చిక్కితే.. ఖతం అయిపోవాల్సిందే. అయితే ఈ అడవి బర్రె మాత్రం మొసలికి చిక్కి కూడా ప్రాణాలతో బయటపడింది. ఇప్పుడు ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

View this post on Instagram

A post shared by طبیعت (@nature27_12)

చూశారుగా ఆఖరి నిమిషం వరకు కూడా మొసలి పట్టు విడవలేదు. అడవి బర్రె తనలో లేని శక్తిని కూడా తెచ్చుకుని.. ప్రాణాలపై తీపితో తప్పించుకునేందుకు చేసిన పోరాటం ఫలించింది. ఎట్టకేలకు అది ప్రాణాలతో బయటపడింది. అయితే బర్రె కాలు దొరుకుంటే మాత్రం.. అది తిరిగి రావడానికి ఆస్కారం ఉండేది కాదు. మొసలికి సరైన పట్టు లభించకపోవడంతోనే.. బర్రె బ్రతుకు నిలిచింది. ఈ వీడియో ఇప్పుడు నెట్టింట తెగ ట్రెండ్ అవుతోంది. నెటిజన్లు తమ మార్క్ కామెంట్లు చేస్తూ.. వీడియోను సర్కులేట్ చేస్తున్నారు.

Also Read: కారులో వచ్చిన ఈ ఆంటీలు ఏం దొంగతనం చేశారో తెలిస్తే మీ మైండ్ బ్లాంక్..

ట్రైన్ వస్తుండగా.. వీడియోకు పోజిద్దామనుకున్నాడు.. విగత జీవిగా మారిపోయాడు..