లంక ప్రీమియర్ లీగ్: సల్మాన్ ఖాన్ ఫ్రాంచైజీ నుంచి తప్పుకున్న క్రిస్ గేల్.. కారణమిదే.!
లంక ప్రీమియర్ లీగ్ నుంచి యూనివర్స్ బాస్ క్రిస్ గేల్ తప్పుకున్నాడు. అతడు ఈ ఏడాది బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ సొంత జట్టైన కండీ టస్కర్స్‌కు..
లంక ప్రీమియర్ లీగ్ నుంచి యూనివర్స్ బాస్ క్రిస్ గేల్ తప్పుకున్నాడు. అతడు ఈ ఏడాది బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ సొంత జట్టైన కండీ టస్కర్స్‌కు ప్రాతినిధ్యం వహించాల్సి ఉండగా.. ఆర్గనైజర్స్‌తో విభేదాలు తలెత్తడం వల్ల లీగ్ నుంచి తప్పుకోవాలని గేల్ నిర్ణయించాడు. ఇక ఈ విషయాన్ని జట్టు యాజమాన్యం కూడా ట్విట్టర్ వేదికగా ధృవీకరించింది. వాస్తవానికి ఎల్‌పీఎల్‌కు ముందు నుంచి అవాంతరాలు తలెత్తుతున్నాయి. కరోనా వైరస్ కారణంగా చాలాసార్లు లీగ్ వాయిదా పడుతూ వచ్చింది.
మరోవైపు పాకిస్థాన్ మాజీ కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్ కూడా జాతీయ జట్టుతో ఉన్న కమిట్‌మెంట్‌లు కారణంగా లీగ్ నుంచి వైదొలిగుతున్నట్లు ప్రకటించాడు. అటు గాలే గ్లాడియేటర్స్ జట్టు ఇంకా శ్రీలంక చేరకపోవడం లీగ్ నిర్వాహకులకు కొత్త తలనొప్పులు తెచ్చిపెడుతోంది. కాగా, శ్రీలంక దిగ్గజ బౌలర్ లసిత్ మలింగా కూడా లంక ప్రీమియర్ లీగ్‌ను ఆడకూడదని నిర్ణయం తీసుకున్నట్లు అక్కడి మీడియా చెబుతోంది.
Also Read:
పింఛన్‌దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్.. ఆ పింఛన్‌ను రెండు విడతలుగా చెల్లించేందుకు.!
జగన్ సర్కార్ మరో గుడ్ న్యూస్.. ఈ నెల 25న వారి ఖాతాల్లోకి రూ. 10 వేలు జమ.!
ఏపీ ప్రజలకు ఆర్టీసీ గుడ్ న్యూస్.. పంచారామాలకు 1,750 స్పెషల్ బస్సులు..