AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘మా బుజ్జిని తిడితే ఊరుకోను;, కుక్కగారి ‘కోపం’ !

చైనాలో ఓ కుక్కగారి వీడియో వైరల్ అవుతోంది. రెండేళ్ల చిన్నారిని తల్లి తిడితే వారి పెంపుడు కుక్క ఊరుకోలేదు. ఆ పాపకు ‘నేనున్నా’ అంటూ బాసటగా నిలిచింది. ఏడుస్తున్న పాపను ఎందుకు తిడుతున్నారన్నట్టు అచ్ఛు మనిషిలాగే ఆమె మీద  ‘కోప్పడింది’. అయిదేళ్ల ఈ జాగిలం ‘కోపం’ చూసి ఆ తల్లి నవ్వును ఆపుకోలేకపోయింది. ఇంతకీ ఆ గడుగ్గాయి ఏం చేసిందంటే ఆ మహిళ ఇష్టంగా కొని తెచ్చుకున్న ఫేషియల్ క్రీమ్ ని మూత తీసేసి క్రీమ్ అంతా […]

'మా బుజ్జిని తిడితే ఊరుకోను;, కుక్కగారి 'కోపం' !
Umakanth Rao
| Edited By: |

Updated on: Oct 13, 2020 | 5:51 PM

Share

చైనాలో ఓ కుక్కగారి వీడియో వైరల్ అవుతోంది. రెండేళ్ల చిన్నారిని తల్లి తిడితే వారి పెంపుడు కుక్క ఊరుకోలేదు. ఆ పాపకు ‘నేనున్నా’ అంటూ బాసటగా నిలిచింది. ఏడుస్తున్న పాపను ఎందుకు తిడుతున్నారన్నట్టు అచ్ఛు మనిషిలాగే ఆమె మీద  ‘కోప్పడింది’. అయిదేళ్ల ఈ జాగిలం ‘కోపం’ చూసి ఆ తల్లి నవ్వును ఆపుకోలేకపోయింది. ఇంతకీ ఆ గడుగ్గాయి ఏం చేసిందంటే ఆ మహిళ ఇష్టంగా కొని తెచ్చుకున్న ఫేషియల్ క్రీమ్ ని మూత తీసేసి క్రీమ్ అంతా పాడు చేసిందట. ఇందుకు కూతురుపై కాస్త మందలించగానే ఆమె ఏడుపు లంకించుకోవడం చూసి ఈ కుక్క అలా బిహేవ్ చేసిందట..

Video Courtesy:MailOnline