తల్లి కాబోతున్న‌ నటి అమృతా రావు

బాలీవుడ్ బ్యూటీ అమృతా రావు తల్లి కాబోతున్నారు. 2016లో ఆర్జే అన్‌మోల్‌ని అమృతా వివాహం చేసుకున్న విషయం తెలిసిందే.

తల్లి కాబోతున్న‌ నటి అమృతా రావు
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Oct 13, 2020 | 5:57 PM

Amrita Rao news: బాలీవుడ్ బ్యూటీ అమృతా రావు తల్లి కాబోతున్నారు. 2016లో ఆర్జే అన్‌మోల్‌ని అమృతా వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. త్వరలో ఈ జంట ఇంట మరో వ్యక్తి ఎంట్రీ ఇవ్వబోతున్నారు. ఈ విషయాన్ని వారిద్దరు ప్రకటించకపోయినప్పటికీ.. ఇటీవల చెకప్ కోసం ఈ జంట ఆసుపత్రికి వెళ్లారు. అక్కడ బేబీ బంప్‌తో ఉన్న అమృత, భర్తతో కలిసి ఆసుపత్రి బయట నిల్చున్న ఫొటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. దీంతో ఈ జంటకు సోషల్ మీడియా వేదికగా అభిమానులు అభినందనలు చెబుతున్నారు. హంగూ, ఆర్భాటాలకు అమృత పెద్దగా ప్రాధాన్యం ఇవ్వరని, అందుకే పెళ్లి గురించి, తల్లి కాబోతున్న విషయం గురించి సన్నిహితులకు తప్ప మరెవరికీ చెప్పలేదని ఆమె ఫ్యామిలీ ఫ్రెండ్‌ ఒకరు చెప్పారు. కాగా వివాహ్‌, ఇష్క్‌విష్క్‌, మై హూనా వంటి బాలీవుడ్ చిత్రాల్లో నటించిన అమృతా.. తెలుగులో మహేష్‌ బాబు నటించిన అతిథిలో హీరోయిన్‌గా మెరిసింది.

Read More:

కొరటాల వెబ్‌ సిరీస్‌లో టాలెంటెడ్ యంగ్ హీరో‌..!

ఆసుపత్రి నుంచి నటుడు డిశ్చార్జి.. పిల్లల ‘వెల్‌కమ్’‌ పోస్ట్‌ వైరల్‌‌