తెలంగాణవ్యాప్తంగా రెడ్ అలర్ట్

తెలంగాణవ్యాప్తంగా రెడ్ అలర్ట్ ప్రకటించింది హైదరాబాద్ వాతావరణ కేంద్రం. ఈ మేరకు వాతావరణ విభాగం అధికారి రాజారావు హెచ్చరిక జారీ చేశారు. తెలంగాణలోని పలు జిల్లాల్లో...

తెలంగాణవ్యాప్తంగా రెడ్ అలర్ట్
Follow us
Rajesh Sharma

|

Updated on: Oct 13, 2020 | 5:51 PM

Red alert for Telangana state: తెలంగాణవ్యాప్తంగా రెడ్ అలర్ట్ ప్రకటించింది హైదరాబాద్ వాతావరణ కేంద్రం. ఈ మేరకు వాతావరణ విభాగం అధికారి రాజారావు హెచ్చరిక జారీ చేశారు. తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని ఆయనంటున్నారు. కేవలం భారీ వర్షాలే కాదు.. బలమైన ఈదురుగాలులు వీస్తాయని, వీటి తీవ్రత కారణంగా చెట్లు, విద్యుత్ స్థంభాలు నేలకూలే స్థాయిలో వుంటుందని ఆయన అంఛనా వేస్తున్నారు.

తెలంగాణవ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం వుందని రాజారావు తెలిపారు. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యే అవకాశం వుందన్నారు. చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకూలే ప్రమాదం వుందని, తీవ్రమైన స్థాయిలో పంట నష్టం జరిగే అవకాశం వుందని ఆయన వివరించారు. రిజర్వాయర్లు ప్రమాదకర స్థాయికి చేరే అవకాశం ఉందని చెబుతున్నారు. ప్రజలు జాగ్రత్తగా వుండాలని, అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు.

మంచిర్యాల, పెద్దపల్లి, కరీంనగర్, జయశంకర్ భూపాలపల్లి, సిద్దిపేట, రాజన్న సిరిసిల్ల, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, వరంగల్, మహబూబాబాద్, ఖమ్మం, సూర్యాపేట, నల్గొండ, యాదాద్రి భువనగిరి, నాగర్ కర్నూల్ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని తెలుస్తోంది. రాజధాని హైదరాబాద్ కూడా భారీ వర్షాల కురిసే జోన్‌లో వుందంటున్నారు.

Also read: తీరం దాటింది.. అయినా ఉత్తరాంధ్రకు ముప్పే!

Also read: రాజధాని రైతులపై చంద్రబాబు ప్రశంసల జల్లు

Also read: చంద్రబాబుకు నోటీసిచ్చిన తహసీల్దార్

Also read: ప్రభుత్వంపై కోర్టుకెక్కిన సినీ నిర్మాత

Also read: ఏపీలో ఐపీఎస్ అధికారుల బదిలీలు